వాస్తవాలను వక్రీకరించవద్దు – పేషెంట్‌కు పూర్తి వైద్య సేవలు అందించాం: ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్
ఆసుపత్రి యాజమాన్య వివరణ
- 02-06-2026 తేదీన మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు 75 సంవత్సరాల వయస్సు గల ఒక పేషెంట్ గుండెనొప్పి, ఆయాసం సమస్యలతో ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు.
- పేషెంట్ గతంలో బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న ఇంటెన్సివిస్ట్ వైద్యుడు స్వయంగా పరీక్షించి వైద్య సేవలు అందించారు.
- పేషెంట్‌కు ECG, 2D ఎకో, రక్త పరీక్షలు తదితర అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి.
- నిర్వహించిన పరీక్షల ఫలితాలను వైద్యులు సమగ్రంగా పరిశీలించగా, ఆ సమయంలో తక్షణ గుండె సంబంధిత అత్యవసర పరిస్థితి ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు గుర్తించబడలేదు.
- పేషెంట్ వయస్సు, గత వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుని ఒక రోజు పాటు ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.
- అయితే, తాము హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నామని, మరుసటి రోజు అక్కడికి వెళ్లనున్నామని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో అవసరమైన వైద్య సూచనలు ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది.
- పేషెంట్ ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు జరిగిన మొత్తం ప్రక్రియ సీసీ కెమెరా రికార్డింగ్స్‌లో నమోదై ఉంది.
- విధుల్లో ఉన్న వైద్యుడు పేషెంట్‌ను పరిశీలించడం, పరీక్షలు సూచించడం, ఫలితాలను వివరించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి అన్ని అంశాలు రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయి.
ప్రజలకు విజ్ఞప్తి
- “డాక్టర్ పేషెంట్‌ను చూడలేదు”, “కేవలం నర్సింగ్ సిబ్బంది మాత్రమే చికిత్స చేశారు” వంటి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి మరియు వాస్తవాలకు విరుద్ధమైనవి.
- ఆధారాలు, వాస్తవాలు పరిశీలించకుండా తప్పుడు ప్రచారం చేయడం వైద్యుల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
- ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత రికార్డులు, ఆధారాల ఆధారంగా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము.
మా నిబద్ధత
గత నాలుగు సంవత్సరాలుగా ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వేలాది మంది గుండె రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను కాపాడడంలో తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది.
పారదర్శకత, నైతిక విలువలు మరియు పేషెంట్ సంక్షేమమే మా ప్రధాన లక్ష్యాలు. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని హామీ ఇస్తున్నాము.
– ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం