నంద్యాల సబ్ కలెక్టరుగా చల్లా విశ్వనాద్ సేవలు భేష్.. చల్లంగుండయ్యా అంటూ ప్రజల దీవెనలు

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల,1 అక్టోబరు 2026(ప్రజాన్యూస్)

నంద్యాల అక్టోబరు1(ప్రజా న్యూస్ ) ..చల్లా విశ్వనాద్ ..చల్లంగుండయ్యా అంటూ నంద్యాల ప్రజలు ఆ అధికారిని ఆశీర్వదిస్తున్నారు..వివరాలలోకి వెళితే నంద్యాల సబ్ కలెక్టరు గా గత రెండేళ్ల క్రితం చల్లా విశ్వనాద్ బాద్యతలు స్వీకరించారు..గతరెండేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చింది..ప్రజలకు రెవెన్యూ సమస్యలు తగ్గించేందుకు అదికారులపై పనిభారం మోపింది..ప్రజలకు విశ్వాసాన్ని చూరగొనాలని అదికారులను ఆదేశించింది.. ఈనేపద్యంలో నంద్యాల సబ్ కలెక్టరుగా బాద్యతలు స్వీకరించిన చల్లా విశ్వనాద్ నంద్యాల డివిజన్ లో పేరుకుపోయిన పెండింగు దస్త్రాల బూజు దులిపారు..పేదలు కార్యాలయం చుట్టూ తిరగరాదని ముఖ్యంగా రైతులు రెవెన్యూ సేవలు అందక ఇబ్బంది పడకూడదని కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు..తనపరిదిలోని తహసిల్దారులను అప్రమత్తం చేసి నంద్యాల డివిజన్ కు రెవెన్యూ శాఖలో మంచి పేరు తెచ్చేందుకు కృషిచేశారు..తన కార్యాలయం సిబ్బంది డిప్యూటీ తహసిల్దార్ రవీంద్ర, యాసిన్ మరియు ఇతర అదికారులతో ప్రతిరోజు చర్చించి తమ కార్యాలయంలో పెండింగ్ పనులను పూర్తిచేశారు..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 22 ఎ, డాటడ్ లైను, ఇనామ్ భూముల సమస్యలను జిల్లాకలెక్టరు రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ల సహకారంతో వేలాది పైళ్లను క్లియర్ చేశారు..22ఎ కి సంబందించి దాదాపుగా 50 ఆన్ లైను ఆప్ లైను పైళ్లను పరిష్కరించి ఏళ్లనాటి రైతుల వ్యదను తీర్చారు..డివిజన్ లోని చాగలమర్రి, గోసుపాడు, నంద్యాలకు చెందిన వేలాది ఇనాం పైళ్లను పరిష్కరించి రైతులకు ఊరటనిచ్చారు.రీసర్వేలో గత ప్రభుత్వ తప్పిదాలతో వేలాది మంది రైతుల సమస్యలను వెబ్ ల్యాండ్ కరెక్షను చేసి ఔరా అనిపించారు..ఓ వైపు అదికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల సహజ వత్తిళ్లను తట్టుకుని ఎవ్వరినీ నొప్పించక సమస్యలేని పైళ్లకు క్లియరెన్సు ఇచ్చారు..కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియను జిల్లాకలెక్టరు రాజకుమారి గణియా ఆదేశాలతో ఈ ఆర్ ఓ శివప్రసాదరెడ్డి సహకారంతో డివిజన్ అంతా విజయవంత చేసిన ఘనత ఆర్డిఓ చల్లాకు దక్కింది..జిల్లాలో రహదారుల అభివృద్దికోసం భూ సేకరణ అంశాలలో కలెక్టరు, జాయంట్ కలెక్టర్ల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుని విజయవంతంచేశారు..దీనితో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ది అదికారిగా ఆ నియోజకర్గ ఎంఎల్ఎ భూమా అఖిలప్రియ సహకారంతో నియోజకవర్గ అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి శబాష్ అనిపించుకున్నారు..వీటితో పాటు ఆర్డిఓ స్థాయిలో ప్రభుత్వం అప్పగించిన ప్రభుత్వ పనులన్నింటిని సకాలంలో పూర్తిచేసి ఉత్తమ అదికారిగా జిల్లాకలెక్టరు మంత్రుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు చల్లా విశ్వనాద్..రెండేళ్ల కాలంలో డివిజన్ లోని అన్ని వర్గాల ప్రజల నీరాజనాలు అందుకున్న సబ్ కలెక్టరు చల్లా విశ్వనీద్ బదిలీ వార్త ఈ ప్రాంత వాసులకు మింగుడు పడటంలేదు..సార్ బదిలో కాకుండా మరో ఏడాది ఉంటే బాగుంటుంది..చల్లా విశ్వనాద్ చల్లంగుండయ్యా అంటూ దీవిస్తున్నారు..మరో రెండురోజుల్లా చల్లా విశ్వనాద్ బదిలీ అయి నంద్యాల సబ్ కలెక్టరుగా ఐఎ ఎస్ అదికారిణి మనీష పదవీ బాద్యతలు తీసుకోనున్నారు..అనతికాలంలోనే ప్రజల మన్ననలు చూరగొన్న యువ ఆపీసర్ కు ప్రజాటివి  తరుపున అభినందనలు తెలుపుతున్నాము..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *