బాలాజీకాంప్లెక్సులో మురికి కాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి..

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల,1 అక్టోబరు 2026(ప్రజాన్యూస్)
నంద్యాల అక్టోబరు 1 (ప్రజా న్యూస్)..నంద్యాలపట్టణంలోని బాలాజీ కాంప్లెక్సు మరియు పరిసర ప్రాంతాలగుండా వెళుతున్న మురుగుకాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి అంటూ ఈ ప్రాంత వాసులు అదికారులను ప్రజాప్రతినిదులను వేడుకుంటున్నారు.

.వివరాలలోకి వెళితే పట్టణంలోని బాలాజీ కాంప్లెక్సు, సంకల్ప పాఠశాల, కేశవరెడ్డి పాఠశాల,మసీదు సాయి ఐశ్వర్య, రాజ్ దియేటర్, జయంతి వెజ్ వరల్డ్ ప్రాంతాల మీదుగా వెళ్లే మురుగు కాలువ పొంగి పొర్లి ఆ ప్రాంతవాసులు నరకయాతన పడుతున్నారు..కాలువనిండా పెద్దపెద్ద చెట్లతోపాటుగా కాలువలో అడ్డుపడిన వ్యర్ధాలను మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించక పోవడంతో మురుగునీరు నిలిచిపోయి కాలువ పొంగిపొర్లుతోంది..ఈ ప్రాంతంలోని 10 ఎకరాలలో మురుగునీరి చేరి దుర్గందం వెదజల్లుతోంది..సమీపంలోని ఎలక్ట్రిక్ ట్రాన్స్ పారం చుట్టూ కూడా నీరు చేరింది..పలితంగా దుర్వాసన వెదజల్లి కాలువ వెంబడి ఉన్న కాలనీల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు..ఈకాల్వవెంబడి నివాస ప్రాంతాలే కాక పాఠశాలలు, పవిత్రమైన మసీదు ఉండటంతో దుర్గందం వెదజల్లి విద్యార్దులు అనారోగ్యం పాలవుతున్నారు..ఈవిషయాన్ని పలుమార్లు స్థానిక ప్రజలు మునిసిపల్ అదికారులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో ఈ మురుగుకాలువ ప్రవాహం ఇళ్లమీదకు వచ్చే పరిస్తితి నెలకొంది..వర్షాలు లేక పోవడంతో కొంతవరకు మేలని వర్షాలు పడితే ఈ కాలువ వెంబడి ఉన్న నివాసాల్లో నివాసం ఉండలేని పరిస్తితి నెలకొని ఉందని స్థానికులు వాపోతున్నారు..ఇప్పటికైనా ప్రజాప్రతినిదులు మునిసిపల్ అదికారులు స్పందించి ఈ కాలువవెంబడి ఉన్న చెట్లను తొలగించి, కాలువలోని వ్యర్ధాలను తొలగించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *