అన్నదాన సత్రం ఏర్పాటుకు రూ.7 లక్ష లు విరాళం అందించిన దూదేకుల సంఘం

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

నంద్యాల,27 ఏప్రియల్ 2026(ప్రజాన్యూస్)

కడప జిల్లా ముడుమాల గ్రామంలో జీవసమాధి పొందిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యులు సిద్దయ్య స్వామి వారి సర్వమత అన్నదాన సత్రం నిర్మాణ పనులకోసం దూదేకుల సంఘం బాసటగా నిలిచింది.

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం దూదేకుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లాలయ్య, బ్రహ్మయ్య ల ఆధ్వర్యంలో దూదేకుల సోదరులందరూ కలిసి సుమారు 7 లక్షల రూపాయలు సమీకరించి నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు.
ఈ సందర్భంగా ఆదివారం దూదేకుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీఠాధిపతులు శ్రీ సిద్దేశ్వర స్వామి, శ్రీ సిద్ధయ్య, శ్రీరామకృష్ణ సర్వమత అన్నదాన సత్రం కమిటీ సభ్యులు రసూల్ ,సిద్దయ్య ఆధ్వర్యంలో సహకరించిన అందరిని సమావేశపరిచి శ్రీ సిద్దయ్య గారి చిత్ర పటం,శాలువాతో దాతలను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కన్నయ్య , ఖాసిం వలి ,శెట్టి వీడు పెద్ద సిద్ధయ్య,ఇమాములు, దస్తగిరి,పాపయ్య,అబ్బాస్ దస్తగిరి, సురేంద్ర, గగ్గుటూరు నాగన్న, ఏరువ పుల్లారెడ్డి, పగడాల సిద్దయ్య ఈవిధంగా వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని దూదేకుల సోదరులందరూ మన దూదేకుల ఇలవేల్పు ఐన ఆరాధ్య దైవమైన సిద్దయ్య స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని పలువురు ఉద్బోధించారు.
దూదేకుల కులస్తులందరూ సిద్దయ్య స్వామి వారిని తరచుగా దర్శించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రుల అవ్వాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *