ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 18 ఏప్రియల్ 2026(ప్రజాన్యూస్) :
నంద్యాల పట్టణంలోని ఓ కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు, కంగన్ సంస్థపై కంజ్యుమర్ కోర్టులో నంద్యాల పట్టణానికి చెందిన వినియోగదారుడు పిర్యాదు చేసారు. వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఫిర్యాదును స్వీకరించింది.

వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని ఒక ప్రముఖ వ్యక్తి కంగన్ డిస్ట్రిబ్యూటర్ వద్ద 2022 లో రూ 2.77 లక్షలకు వాటర్ ఫూరిఫైర్ మెషిన్ ను కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంగన్ వాటర్ ఫూరిఫైర్ కావడంతో ఆల్కలైన్ నీటితో ఆరోగ్యం మెరుగవుతుందని భావించి ఫూరిఫైర్ కొనుగోలు చేశారు. అయితే కొన్ని రోజులకు ఆ వ్యక్తికి తన శరీరంలో మార్పులు కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో యూరిక్ యాసిడ్ పెరగడంతో ఒక్కసారిగా ఖంగుతున్నారు. తాగే నీటి ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆ వ్యక్తి సదరు డిస్ట్రిబ్యూటర్ కు సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఫూరిఫైర్ లో మార్పులు ఉన్నాయని, కంపెనీ కి పంపించి మార్పు చేయిస్తానని, లేదా మీ డబ్బు వాపస్ ఇస్తానని చెప్పి ఫూరిఫైర్ ను తీసుకెళ్లాడు. అప్పటినుంచి పలు దఫాలుగా ఆ వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ ను ఫూరిఫైర్ గురించి అడుగగా నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చాడు. కొన్ని రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్ ను వినియోగదారుడు గట్టిగా నిలదీయగా అప్పుడే ఫూరిఫైర్ ను సర్వీస్ కు పంపించానని, అది బాగా పనిచేస్తుందని చెప్పి సర్వీస్ సెంటర్ లోని ఎంట్రీ పుస్తకంలో ఫూరిఫైర్ పంపించినట్లుగా సాక్షం సృష్టించాడు. దీంతో అనుమానం వచ్చిన కొనుగోలుదారుడు సంస్థను ఈ మెయిల్ ద్వారా వివరాలు కోరగా ఆ సీరియల్ నంబర్ కలిగిన ఫూరిఫైర్ తమ సంస్థలోని ఏ సర్వీస్ సెంటర్లో సర్వీస్ కు రాలేదని సంస్థ సమాధానం ఇచ్చింది. దీంతో కొనుగోలుదారుడు అన్ని సాక్షాలతో కంజ్యుమర్ కోర్టును ఆశ్రయించగా డిస్ట్రిబ్యూటర్ తో పాటు కంగన్ సంస్థకు సమన్లు జారీ అయ్యాయి. ఆరోగ్యం కోసం లక్షలు వెచ్చించి వాటర్ ఫూరిఫైర్ కొనుగోలు చేసిన చాలామంది వినియోగదారులు ఈ ఘటనతో ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. తాము కొనుగోలు చేసిన వాటర్ ఫూరిఫైర్ ల పనితీరుపై ఆందోళన చెందుతూ తమ వాటర్ మెషీన్లను పరీక్షించుకునే పనిలో పడ్డారు.