ASP యుగందర్ సమయస్పూర్తితో శ్రీశైలంలో భక్తుల తొక్కిసలాటలో భారీగా తప్పిన ప్రాణ నష్టం..ASP ని అభినందిస్తున్న ప్రత్యక్ష సాక్షులు..

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 10పిబ్రవరి2026(ప్రజాన్యూస్) :

శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్బంగా రెండవరోజు భక్తులు అదికసంఖ్యలో రావడంతో తొక్కిసలాట ఏర్పడింది..నంద్యాల జిల్లా ఎ ఎస్ పి యుగందర్ బాబు సమయస్పూర్తితో భారీ ప్రాణనష్టం తప్పింది..ఎ ఎస్ పి సమయ స్పూర్తిని ప్రత్యక్షంగా చూసిన భక్తులు అబినందిస్తున్నారు..

 

శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్బంగా మొదటి రోజు భక్తులు సాదారణంగా ఉండటంతో సాపీగా జరిగింది..రెండవరోజు శివస్వాములు,భక్తులు అంచనాలకు మించి దర్శనానికి రావడంతో దేవస్థానం అదికారులు అదుపుచేయలేని పరిస్తితి ఏర్పడింది..క్యూలైన్లలో వేచియున్న భక్తులు గంటలకొద్ది దర్శనం కాకపోవడంతో పేషంట్లు అపస్మారక స్థితిలో పడ్డారు.దీంతో శివస్వాములు సహనం కోల్పోయి క్యూలైన్ల ద్వంసానికి సిద్ద పడ్డారు..మరికొంత మంది గేట్లు దూకి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు..దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..ఓవైపు స్వాముల ఆందోళన జరుగుతుంటే మరో వైపు క్యూలైన్లనో ఊపిరాడక ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లారు..ఈ విషయాన్ని భక్తులు, శివస్వాములు క్యూలైను దగ్గరలోనే ఉన్న నంద్యాల అడిషనల్ ఎస్ పి యుగందర్ బాబుకు గట్టిగా అరుస్తూ చెప్పారు..అపస్మారక భక్తులను బయటకు తీసుకు రాలేకపోతే ప్రాణాపాయం జరుగుతుంది..అయితే ఎటుచూసిన క్యూలైన్లలో వేలాది మంది భక్తులు ఉన్నారు..వారిని కాపాడేందుకు అడిషనల్ ఎసి పి క్యూలైను గేట్లను తెరిచారు..ఇదే అదునుగా వందలాది మందులు భక్తులు ముందుకు దూసుకు వచ్చారు..దూసుకువస్తున్న భక్తులను అదుపుచేయకపోతే వారు క్యూలైన్లలోకి చొరబడితే తొక్కిసలాట జరిగి భారీ ప్రాణనష్టం జరిగేది..దీనికితోడు అస్వస్తకు లోనైన భక్తులను బయటకు తేవాలన్న తపన..ఈ సంఘటనతో అడిషనల్ ఎస్ పి యుగందర్ బాబు లాఠీని స్పీడుగా పైకి లేపడం నేలను కొట్టడం చేశారు..అంటే కేవలం దూసుకు వస్తున్న భక్తులను అదుపు చేయడానికి భయపించారు..ఆయన లాఠీ పైకి ఎత్తిన స్పీడుకు శివస్వాములు వెనక్కి తగ్గడం మొదలు పెట్టారు..దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది..వెంటనే అస్వస్థతకు గురైన వారిని బయటకు తెచ్చే ప్రయత్నం అడిషనల్ ఎస్ పి యుగందర్ బాబు చేశారు..ఈ విషయం తెలియక శివస్వాములపై విచక్షణా రహితంగా లాఠీ చార్జి చేశారని కొన్ని మీడియా చానల్స్ హైలెట్ చేశాయి..అయితే అక్కడి పరిస్థితిని స్వయంగా గమనించిన శివస్వాములు,మరికొంత మంది భక్తులు మాత్రం ఎ ఎస్ పి యుగందర్ బాబు లేకుంటే క్యూలైన్లలో అపస్మారక స్థితిలో ఉన్న వారిని బయటకు తేలేక ప్రాణనష్టం జరిగేదని, అలాగే శివశ్వాములను పోలీసు అదికారి లాఠీతో బెదిరించకపోతే వారంత క్యూలైన్ల లోకి వచ్చేవారని తొక్కిసలాటతో బారీ ప్రాణనష్టం జరిగేదని చెబుతున్నారు.. ఏది ఏమైనా దేవస్థానం అదికారులు భక్తులరద్దీని అంచనా వేయలేకపోవడం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం సమస్యకు మూలకారణమని, పోలీసులు ఎలాంటి తప్పిదం చేయలేదని భక్తులు పేర్కొంటున్నారు..సిసి కెమెరాలు పరిశీలించి చూస్తే ఎ ఎస్ పి యుగందర్ బాబు ఎవరినీ కొట్టలేదని తెలుస్తుందని వారు చెబుతున్నారు..ఏది ఏమైన సమయస్పూర్తితో భక్తుల ప్రాణాలు రక్షించిన పోలీసు అదికారి యుగందర్ బాబును, బందోబస్తులో ఉన్న పోలీసులను పలువురు అభినందిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *