సాయిబాలజీనర్శింగ్ హోంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..పోటెత్తిన జనం

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, పిబ్రవరి 8  2026(ప్రజాన్యూస్) :

నంద్యాలపట్టణంలోని సాయిబాలాజీ నర్శింగ్ హోం అదినేత డాక్టర్ హరినాదరెడ్డి ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది..ఉదయం 9గంటలనుండి 2గంటలవరకు ఈవెద్య శిబిరానికి రోగులు పోటెత్తారు.

ఉదయం నుండే సాయిబాలాజీనర్శంగ్ హోంలో షుగరు బిపి గుండె జబ్బులు,కిడ్నీ నరాల జబ్బులు అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం ప్రారంభమయింది..నిష్నాతులైన వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందించారు.షుగరు,బిసి, ఈసిజి, 2డి ఎకో కంటిపరీక్ష్లలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీచేశారు..కార్యక్రమంలో డాక్టర్ హరినాదరెడ్డి తోపాటుగా డా క్టర్ మురళీకృష్ణ,డాక్టరు కీర్తిరెడ్డి, డాక్టరు వెంకటస్వామి, డాక్టరు యస్ సి లక్ష్మయ్య, డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి వైద్య సేవలు అందించారు..దశాబ్దాలకాలంగా డాక్టరు హరినాదరెడ్డి ఆద్వర్యంలో వేలాది ఉచిత పరీక్షలు నిర్వహించి నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోగులకు విశేష సేవలు అందించడం పట్ల జిల్లా వ్యాప్తంగా పలువురు పేద రోగులు ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *