:క్యాన్సర్ డే సందర్బంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన నంద్యాల రోటరీ,ఇన్నర్ క్లబ్, ఐఎంఎ,ఉదయానంద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, పిబ్రవరి 4  2026(ప్రజాన్యూస్) :

ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా. ఉదయానంద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నంద్యాల రోటరీ క్లబ్ ,నంద్యాల ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్మూలన పై అవగాహన ర్యాలీ నిర్వహించారు..

పిబ్రవరి 4 క్యాన్సర్ డే సందర్బంగా ఉదయానంద క్యాన్సర్ ఇన్సిట్యూట్ నంద్యాల రోటరీ,ఇన్నర్ క్లబ్లు,ఐఎంఎ ఆద్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఉదయానంద హాస్పిటల్స్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగిన ఈర్యాలీని నంద్యాల ఎఎస్ పి జావలి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు…ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అన్న సామెత మేరకు వ్యాది రాక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్నారు..క్యాన్సర్ వ్యాది బారిన పడకముందే ముందస్తుగా క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ను జయించవచ్చు అని ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ ర్యాలీని నిర్వహించామన్నారు..

కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,న్యాయ వాది వివేకానంద రెడ్డి,ఇన్నర్ వీళ్ల అధ్యక్షురాలు ఎంఎన్ మల్లేశ్వరి. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు. ఉదయానందా హాస్పిటల్ డైరెక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ భార్గవ,డాక్టర్ సుస్మిత, ఐఎంఎ ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలు మాధవి,పీడీజిలు రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, కైలాసనాద్ రెడ్డి. డాక్టర్ రవి కృష్ణ డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రోటరీ క్లబ్ సభ్యులు ఇన్నర్ వీల్ సభ్యులు. ఉదయానంద హాస్పిటల్. డాక్టర్లు ,సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *