ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 26అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల రోటరీక్లబ్ వారి అద్వర్యములో రోటరీక్లబ్ ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి గారి సహకారముతో భగత్‌సింగ్ లైబ్రరీ నిర్వాహకుడు శంకరయ్య కి లైబ్రరీ అభివృద్ధి కోసం రూ.5000/- ల రూపాయాలు విరాళాన్నిరోటరీ క్లబ్ అధ్యక్షుడు, న్యాయవాది వివేకానంద రెడ్డ అందించారు….ఈసందర్బంగా అద్యక్షులు వివేకానందరెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్లు ద్వారా నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు..ఇందులో భాగంగా సమాజానికి ఉపయోగపడే గ్రందాలయాన్ని నిర్వహిస్తున్న భగత్ సింగ్ లైబ్రరీ నిర్వహకులు శంకరయ్యకు విరాళం అందించామన్నారు,…ఈకార్యక్రమంలో , పీడీజీ శ్రీరామమూర్తి ,మామిడి మధు, పుల్లారెడ్డి,కామిని బాలకృష్ణ సభ్యులు nc.మోహనరెడ్డి, వెంకటేశ్వ ర్లు తదిత రులు పాల్గొన్నారు