నంద్యాలజిల్లా,10ఏప్రియల్ 23(ప్రజాన్యూస్):అడ్డదిడ్డంగా ఏడుసార్లు పెంచిన విద్యుత్ చార్జీలు వైకాపామెడకు ఉరితాళ్లు అవుతాయని తెలుగుదేశం పార్టీ రైతుసంఘరాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు పేర్కొన్నారు..
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెరుగుదలపై టిడిపి అదిష్టానం చేపట్టిన నిరసనలలో భాగంగా నంద్యాలజిల్లాకేంద్రంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి భూమా బ్రహ్మానందరెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన నిరసనకార్యక్రమంలో గుంటుపల్లి హరిబాబు పాల్గొన్నారు..ఈసందర్బంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక పేదలను అనేకరకాలుగా ఇబ్బందులకుగురిచేస్తోందన్నారు..200 యూనిట్ల వరకు పూర్తిగా పూర్తిగా అంటూ దీర్ఘాలు తీస్తూ ఉచితంగా కరెంటు ఇస్లానన్న పెద్దమనిషి అదికారంలోకి వచ్చాక ఏడుసార్లు చార్జీలమోత పేదలపై మోపారన్నారు..విద్యుత్ చార్జీలపెరుగుదల ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా అనేక రంగాలపై పడి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని పలితంగా పేదప్రజల జీవనప్రమాణాలు దిగజారాయన్నారు..విద్యుత్,రవాణా,పెట్రోలు డీజల్ పై ప్రజలుమోయలేని భారాన్ని మోపి నవరత్నాలపేరుతో ప్రజలను వంచిస్తున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతంపాడే రోజు దగ్గరపడిందన్నారు..కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు అదికసంఖ్యలో పాల్గొన్నారు