ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి నంద్యాల
నంద్యాల జులై 12{ప్రజాన్యూస్,) :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను తక్షణమే పరిష్కరిస్తాం అని నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ అన్నారు
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్. సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి హరినాథ్ రావు లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం లో భాగంగా నంద్యాల రెవెన్యూ డివిజన్ నలుమూలల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించామన్నారు నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని 17 మండల తహసిల్దార్ వారి కార్యాలయంలలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండిఅర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన. సచివాలయ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేశారని సచివాలయల ద్వార కూడా అర్జీలు స్వీకరించబడు తాయి అని అన్నారు అర్జీ దారులు సచివాలయాల్లో. తహసీల్దార్ కార్యాలయాల్లో. సమస్యలు పరిష్కారం కానప్పుడు నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయమున కు రావాలన్నారు ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమం లో ఎక్కువ శాతం భూములను సర్వే చేయించాలని. భూములను ఆక్రమించారని. భూములు ఆన్లైన్లో నమోదు చేయించాలని భూములు కొలతలు వేయించాలని కోరుతు దరఖాస్తులు అందాయన్నారు ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమానికి దాదాపుగా.16 దరఖాస్తులు అందినవి అని ఆమె అన్నారు ప్రజలందరూ కోవిడ్ నియంత్రణ సూచనలు. లు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని. సామాజిక దూరం పాటించాలని. తరచుగా సబ్బునీటితో చేతులు శుభ్రపరుచుకుంటు ఉండాలని ప్రజలకు సూచించారు ప్రభుత్వం సచివాలయంలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఉచితంగా కోవిడ్ నియంత్రణ టీకాలు వేస్తున్నారు టీకా పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకాలు వేయించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు