కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్):;గడివేముల మండలం పెసరవాయి జంటహత్యలనేపద్యంలో అదికార ప్రతిపక్షనేతల మద్య మాటలయుద్దం మొదలైంది..గడివేముల మండలంలో టిడిపినేతల హత్యోదంతంపై టిడిపి జాతీయప్రదాన కార్యదర్శిా నారాలోకేష్ వ్యాఖ్యలపై కర్నూలుజిల్లాలోని ఎంఎల్ ఎలు తీవ్రంగా స్పందించారు..ఈనేపద్యంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి గత సంఘటనలపై లోకేష్ ను నిలదీశారు.. ఈసందర్బంగా శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ ‘ పెసరవాయి జంట హత్యలపై చిట్టి నాయుడు లోకేష్ అవాకులు, చవాకులు మాట్లడటం దారుణమన్నారు… వైసీపీ నాయకులను కుక్కలతో పోలుస్తున్నారు.. అవును.. మేము కుక్కలమే.. ప్రజలకు విశ్వాసంగా పనిచేస్తాం.మీరేం చేశారో సమాదానం ఇవ్యాలన్నారు.. నంద్యాల వైసీపీ దళిత నాయకుడు సుబ్బరాయుడుని టీడీపీ నాయకులు హత్య చేసినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదు..?. కొత్తపల్లె సర్పంచ్ తులసిరెడ్డిపై హత్యాయత్నం చేసినప్పుడు భూమా కుటుంబ పాత్ర ఉందని చెప్పినా ఆఖిలప్రియకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారో చెప్పాలి..? ‘ అని మీడియా వేదికగా లోకేష్‌పై శిల్పారవి ప్రశ్నల వర్షం కురిపించారు.ప్రతివిషయాన్ని రాజకీయంచేసేవిదంగా అలవాటు చేసుకున్న టిడిపి అదినేత చంద్రబాబుకు వారసుడిగా చిట్టిలోకేష్ వ్యవహారశైలి కూడా రాజకీయంకోసం జిల్లాలో చిచ్చుపెట్టే విదంగా ఉందన్నారు…