కర్నూలు జూన్18(ప్రజా న్యూస్): కర్నూలు జిల్లాలో రెండు అవినీతి చేపలు ఎసిబి వలకు చిక్కాయి.. జిల్లాలోని ఆత్మకూరు మునిసిపల్ కార్యాలయం పరిధిలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి పన్ను వేయడం కోసం ఆనంద రావు అనే వ్యక్తి నుంచి 8000 డిమాండ్ చేసిన మున్సిపల్ సిబ్బంది లింగస్వామి ఎల్లన్న..డబ్బు ఇచ్చుకోలేని ఆనందరావు ఎసిబి ని ఆశ్రయించారు.. ఈ మేరకు ఎసిబి అధికారులు వల పన్ని లంచం తీసు కుంటుండగా పట్టుకున్నారు.