నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్);కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసర్వాయి గ్రామములో శుక్రవారం హత్యకు గురైన ఒడ్డు కుటుంబాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శనివారం పరామర్శించారు. హత్యకు గురైన ఒడ్డు బ్రదర్స్ భౌతిక కాయాలకు నారా లోకేష్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. జంట హత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు..లోకేష్ వెంట టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,ఎం ఎల్ సి ఫారూఖ్,మాజీ మంత్రి ఏరాసు ప్రతాపు రెడ్డి,పాణ్యం టిడిపి ఇంచార్జి గౌరు చరిత,మాజీ ఎం ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి ఇతర టిడిపి నేతలు అంత్యక్రియలకు హాజరయి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు