26న ఆకాశంలో అద్భుతం

కోల్‌కతా: ఈనెల 26న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అనంతరం చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా కనిపించనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. దేశానికి ఈశాన్యాన ఆకాశంలో ఈనెల 26న సాయంత్రం ఈ అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుంది. ఈ గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలక ముగుస్తుంది. అంటే 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. కోల్‌కతా ఇలాంటి చంద్ర గ్రహణాన్ని పదేళ్ల క్రితం అంటే 2011 డిసెంబరు 10న చూడగలిగిందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌, ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబీ ప్రసాద్‌ దౌరీ తెలిపారు. ఈ చంద్ర గ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్‌ సముద్రం, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేయాల్లో కనిపిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *