జనం..కోమలం..కోమల మధుకు నీరాజనం

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల,22 అక్టోబరు 2026(ప్రజాన్యూస్)

నంద్యాల మునిసిపల్ ఎన్నికలలో అభ్యర్దుల ప్రచారం ఊపందుకుంది..ఈనెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్లు,ఉపసంహరణ ప్రక్రియ 21 తో ముగిసింది..దీంతో బరిలో ఉన్న అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు..ఈనేపద్యంలో నంద్యాల 28 వవార్డు టిడిపి అభ్యర్తి గడ్డం మధుమోహనరెడ్డి అలియాస్ కోమల మధు ప్రచారం ముమ్మరం చేశారు..రైతునగరం గ్రామానికి చెందిన గడ్డం మధుమోహనరెడ్డికి ఇదే గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆశీస్సులతో పాటుగా గ్రామానికి చెందిన పలువరు టిడిపి నేతలు మద్దుతు బలంగా ఉండటంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు..మార్కెటు యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పలువురు టిడిపి నేతల ఆద్వర్యంలో ఆయన ప్రచారం ముమ్మరం చేశారు..ఇంటింటికి తిరుగుతూ టిడిపి చేసిన చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ తనను అత్యదిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..చెప్పాం… చేస్తున్నాం! అభివృద్ధే ధ్యేయం..అంటూ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.. రైతునగరం పాత గ్రామంతో పాటు శివారుకాలనీలలో టిడిపి చేపట్టిన అబివృద్ది కార్యక్రమాల నేపద్యంలో కోమల మదుకు జనం నీరాజనంపలుకుతున్నారు..ఏ ఇంటికి వెళ్లినా జనం..కోమలంగా కోమల మదుకు మద్దుతు తెలుపుతున్నారు..ఈ సందర్బంగా గడ్డం మదుమోహనరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో 28 వవార్డు ప్రజలనుండి పూర్తి మద్దతు లబిస్తోందని ఎన్నకలలో గెలిచి ప్రజల అవసరాలను ఆకాంక్షలను నిలబెడతానన్నారు..మంత్రి పరూఖ్, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు,,గ్రామ పెద్దల సహకారంతో వార్డు సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు..ప్రచారంలో నంద్యాల మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు,,తెలుగుదేశం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి వెంకటకృష్ణయ్య,తెలుగుదేశం నాయకులు విశ్వనాదరెడ్డితో పాటుగా వార్డు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *