నంద్యాల ఎన్ ఐ టిసి ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత..

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 08 సెప్టెంబరు 2026(ప్రజాన్యూస్)

నంద్యాల ఎన్ ఐ టిసి ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత..ఆగిపోయిన గుండెను రిస్థార్ట్ చేసి ప్రాణం నిలిపిన వైద్యులు
వైద్యులను ఘనంగా సన్మానించిన బాదిత కుటుంబం

నంద్యాలజిల్లాకేంద్రంలోని నంద్యాల ఇంటెన్సివ్ మరియు ట్రామా కేర్ యూనిట్ ఎన్ ఐ టిసి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అరుదైన ఘనత సాదించారు..ఆగిపోయిన గుండెను రిస్టార్ట్ చేసి ఓ 22 రెండు ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు..ప్రాణాలు నిలిపిన వైద్యులను బాదితయువకుడు నాగేంద్ర వారి బందువలు ఆసుపత్రి వైద్యులను ఘనంగా సన్మానించారు..

.నంద్యాలజిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఎలక్ట్రీషియన్ గా వృత్తితో జీవనం సాగిస్తున్నాడు ..ఆగస్టు 28 వతేది పనిచేస్తుండగా ప్రమావ వశాత్తు నాగేంద్ర విద్యుత్ షాక్ కు గురయ్యాడు..దీంతో ఒక్కసారిగా నాగేంద్ర అపస్మారక స్తితికి చేరుకుని గుండె ఆగిపోయింది..చనిపోయాడనుకున్న నాగేంద్రను నాగేంద్ర స్నేహితులు హుటాహుటిన పది నిమిషాలలో పట్టణంలోని ప్రముఖ ఇంటిన్సివ్ అండ్ ట్రామాకేర్ యూనిట్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి తరలించారు..వెంటనే స్పందించిన వైద్యులు ఆగిపోయిన గుండెను రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు..సిపిఆర్ మాత్రమే కాకుండా డబుల్ మిషన్ తో వెంట వెంటనే షాక్ లు ఇచ్చారు..తమ అనుభవం అంతా ఉపయోగించి ప్రమాదబాదితులు నాగేంద్రకు వైద్యం అందించారు..వెంటనే గుండె పనిచేయడం మొదలుపెట్టడంతో మెదడు డ్యామేజి కాకుండా న్యూరో వైద్యం అందించారు..దీంతో నాగేంద్ర పదిరోజులలోనే కోలుకుని మామూలు మనిషి అయ్యాడు..దీంతో నాగేంద్ర మరియు నాగేంద్రబందువులు ఎన్ ఐటిసి వైద్య బృందాన్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ సాదారణంగా ఇటువంటి సందర్బాలలో నంద్యాలలో వైద్యం అందించడం కష్టం అని అయితే బాదితుడి స్నేహితులు కేవలం పదినిమిషాలలోనే తమ ఆసుపత్రికి తేవడంతో తమ వైద్యులు చరిష్మా, దివిజ,నరాల వైద్యులు వరదరాజు నర్శింగ్ ష్టాప్, టెక్నీషియన్లు తమ అనుభవాన్నంతా రంగరించి నాగేంద్రకు వైద్యం అందించారన్నారు..చిన్న వయసులోనే ఉన్న యువకుడి కుటుంబాన్ని నిలబెట్టినందుకు తమకు ఎంతో సంతృప్తి కరంగా ఉందని ఎన్ ఐటిసి లో అనుబవగ్నులైన వైద్యులు ఉండబట్టే ఇలాంటి అసాద్యం సుసాద్యం అయిందన్నారు..తమ సంస్థపై నమ్మకంతో వెంటనే నాగేంద్రను ఆసుపత్రికి తీసుకు వచ్చిన మిత్ర బృందాన్ని ఈ సందర్బంగా డాక్టర్లు అభినందిస్తూ ఈ సంఘటనతో మరింత నమ్మకంగా ప్రజలకు ఎన్ ఐటిసి సేవలు అందిస్తున్నామన్నారు..అనంతరం నాగేంద్ర,వారితరుపున బందువులు డాక్టర్ శ్రీదర్ రెడ్డి, డాక్టర్ వరదరాజులు డాక్టర్ చరిష్మాబేగం, డాక్టర్ దివిజ, డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, మేనేజర్ ప్రశాంత్ లను ఘనంగా సన్మానించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *