ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 24సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరన్ ని నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈసందర్బంగా రాణి మహరాణి థియేటర్ దగ్గర జరుగుతున్న పొట్టేలు సంత మార్కెట్ను నూనెపల్లి లోని మార్కెట్ యార్డులోకి తరలించేందుకు సహకరించవలసిందిగా చైర్మన్ హరిబాబు ఎస్ పిని కోరారు… ప్రవేట్ వ్యక్తుల ఆధీనంలో జరుగుతున్న పొట్టేలు సంత వలన పలు గ్రామాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,. కావున మార్కెట్ యార్డు ఆదాయం పెంచుట కొరకు పొట్టేలు సంతను మార్కెట్ యార్డ్ తరలించడానికి సహకరించవలసిందిగా ఎస్పీ సునీల్ షెరాన్ ను ఈసందర్బంగా ఆయన కోరారు..ఈ విషయంలో ఎస్పీ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఈసందర్బంగా చైర్మన్ హరిబాబు తెలిపారు.. .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డి.రంగ ప్రసాద్ ,అడ్వకేట్ హుస్సేన్ బాబు ,డైరెక్టర్ స్వామి నాయక్ పాల్గొన్నారు..