♦ ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతామని, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.., డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో కలిసి 10 రోజులుగా బేతంచెర్ల మైనింగ్ కార్యాలయం ముందు నాపరాతి పరిశ్రమల యాజమాన్యం చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించారు.. గ్రైనెట్, టైల్స్ నుంచి నాపరాతికి గట్టి పోటీ ఉందని, ఈ పరిస్థితిలో కన్సిడరేషన్ చార్జీలు వేయడం సరికాదని, జీవో నెంబర్ 42 ను రద్దు చేసి నాపరాతి పరిశ్రమలు ఆదుకోవాలని దీక్ష చేస్తున్న వారు ఎంపీ బైరెడ్డి శబరి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే నాపరాతి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జీవో నెంబర్ 42 మైనింగ్ యాక్ట్ కన్సిడరేషన్ ఫీజు వల్ల నంద్యాల జిల్లాలోని నాపరాతి పరిశ్రమలకు కష్టాలు వచ్చాయని, ఈ జీవో వల్ల కన్సిడరేషన్ ఫీజు మూడేళ్ళ తర్వాత మొత్తం చెల్లించే వరకు రాయల్టీలను ఆపడం వల్ల ముడిసరుకు లేక నాపరాతి పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందన్నారు. 10 రోజులుగా దీక్షలు చేస్తున్న వారికీ భరోసా ఇవ్వడానికే తాము దీక్ష శిభిరం వద్దకు వచ్చామని, టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి మీ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చూపేందుకు దైర్యం గా మీ ముందుకు వచ్చామని, ఎక్కడ అన్యాయం జరిగిన తాను వెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా దీక్ష శిబిరంలో హర్షద్వానాలు మోగాయి.
కొందరు ఆరోపిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, తాము గాని ఏ సీ గదుల్లో కూర్చోవడం లేదని రోడ్లపై తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకే కష్టపాడుతున్నామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా సమస్య ఉన్న చోటికే వెళ్లి వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నామని, మాపై నమ్మకం ఉంచి దీక్ష విరమించాలని ఎంపీ శబరి కోరడంతో నాపరాతి పరిశ్రమల యాజమాన్యం అంగీకారం చెప్పడంతో ఎంపీ శబరి నిమ్మరసం అందించి దీక్షలు విరమింపజేశారు.