♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
అన్ని జన్మలలోకి మానవజన్మ గొప్పదంటారు..అటువంటి జన్మ భగవంతుడు ప్రసాదించినపుడు ఆ జన్మసార్ధకం చేసుకోవాలన్న తపన ఆయనది..వృత్తిలో ఎంత ఎదిగినా ఒదిగి తనకు భగవంతుడు ఇచ్చిన వృత్తి దర్మంలో పేదప్రజలకు సేవలు చేయాలన్నదే ఆయన లక్ష్యం..తన ఉన్నతికి పాటుపడిన అన్ని వర్గాల క్షేమం..అందుకు తోడ్పడిన భగవంతుడికి తనకు తోచిన సేవ చేయాలన్నది ఆయన సంకల్పం..వైద్య వృత్తిలో ఓనమాలు నేర్చుకున్ననాటినుండి వైద్యంలో చేయి తిరిగిన పేరుమోసిన వైద్యులుగా స్థిరపడ్డా ఆయన లక్ష్యం పేదలకు ఆధునిక వైద్యం అందించడమే..ఎన్నో విమర్శలు..మరెన్నో ఆటంకాలు ఎదురైనా మొక్కఓని ధైర్యంతో నంద్యాల నగరానికి తగ్గట్టుగా ఆధునిక వైద్య సేవలు అందించడంలో ముందున్నారు వైద్య నారాయణుడు నంద్యాల పట్టణానికి చెందిన సాయి బాలాజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హరినాదరెడ్డి
రెండు దశాబ్దాలకు పైగా వైద్యరంగంలో నంద్యాల పట్టణంలో ఈయన సేవలు అందించారు..దాదాపు దశాబ్దకాలంగా దాదాపు వెయ్యికిపైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి నంద్యాలజిల్లాలోని లక్షలమంది పేదప్రజల గుండెల్లో నిలిచిపోయారు డాక్టరు హరినాదరెడ్డి..ఉచిత వైద్య శిబిరం అంటే తూ..తూ మంత్రంగా కాక అన్ని రకాల రోగాలకు సంబందించిన నిపుణులైన డాక్టర్లను నియమించి అత్యాధునిక పరికరాలతో వైద్య పరిక్షలు నిర్వహించి రోగానికి తగ్గట్టుగా బ్రాండెండ్ కంపెనీల మందులను ఉచితంగా అందిస్తారు డాక్టరు హరినాదరెడ్డి..ఒక్కసారి హరినాదరెడ్డితో వైద్యం చేయించుకున్న ఏ రోగి అయినా ఆయనకు ప్యామిలీ డాక్టర్ గా ఊహించుకుంటారు ప్రజలు..రోగం తగ్గాలంటే హరినాదరెడ్డి చెయ్యి పడాల్సిందే అనేవారు లక్షల్లో ఉన్నారంటే ఈయన అందించే వైద్యం,రోగిపట్ల చూపే ప్రేమాభిమానాలు,పలకరింపు ఎలా ఉంటుందో ఊహించవచ్చు..నంద్యాలపట్టణంలో డేనియల్ పురంగేట్ లో సాయిబాలాజీ నర్శింగ్ పేరుతో ఈయన స్థాపించిన ఆసుపత్రికి ప్రతిరోజు జిల్లాలోని నలుమూలలనుండిరోగులు క్యూ కడతారు..వీరందరిని పేరు పెట్టి పిలిచే అంత చనువు డాక్టరు గారి సొంతం…
జిల్లా ప్రజలు తమపై చూపుతున్న అభిమానం ఆదరణకు తగ్గట్టుగా వీరికి తనవంతుగా ఏమిచేయాలనే ఆలోచన డాక్టరు హరినాదరెడ్డికి కలిగింది..ఈనేపద్యంలోనే ఆధునిక వైద్యంకోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి లక్షల్లో ఖర్చుచేసుకుంటున్న ఈప్రాంతప్రజలకు ఆదునిక వైద్యం అందుబాటులోకి తేవాలని డాక్టరు రెడ్డి తలంచారు..వెంటనే ఆచరణలోకి దిగి పట్టణంలో నంద్యాల క్రిటకల్ కేర్ సెంటర్ కు రూపకల్పనచేశారు..సహచర యువ డాక్టర్లను ఒప్పించి అన్నిరకాల వైద్యసేవలు ఇక్కడే అందే విదంగా ఆధునిక పరికరాలు కొనుగోలుచేసి నిష్ణాతులైన డాక్టర్లను అందులో భాగస్వామ్యంచేశారు..ఆదాయాలకు విలువ ఇవ్వకుండా వైద్యోనారాయణ అన్నసూక్తికి కట్టుబడి ఇందులో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క డాక్టరు వైద్యశాలను ఆదునిక దేవాలయంగా తీర్చిదిద్దారు..ఇక్కడ వైద్యం చాలాఖర్చు అని ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు..అయితే ప్రాక్టికల్ గా విజయవాడ గుంటూరు హైదరా బాదు వెళ్లి చూస్తే ఏవైద్యంచేశారో కూడా తెలియకుండా బిల్లులు చెల్లించి రావలసిన పరిస్తితితోపాటుగా రోగి అక్కడికి చేరేలోపుగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి.ఈపరిస్థితిని నంద్యాల క్రిటికల్ కేర్ హాస్పిటల్ అదిగమించింది..ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడింది.ప్రమాదం ఎప్పుడైనాజరుగవచ్చు..ఆపద ఏక్షణాన్నైనా రావచ్చు..కాని ఎల్లప్పుడు మన ఆరోగ్యానినకి ప్రాధాన్యతనిస్తూ 24గంటలు అత్యవసరసేవలు అందిస్తోంది నంద్యాలక్రిటికల్ కేర్ సెంటర్.. నిష్ణాతులైన క్రిటికల్ కేర్ స్పెషలిస్టులచే వైద్యసేవలు ఇక్కడ అందిస్తారు…అత్యాధునిక ICU Medical sregical emergency,కీళ్లమార్పిడి ఆపరేషన్లు,మోకాలు,కీ హోల్ ఆపరేషన్లు ట్రామకేర్ అండ్ డయాలసిస్ యూనిట్స్ అత్యాధునిక ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు అన్నిరకాల పాయిజనింగ్, కరెంటు షాక్, ట్రామాకేర్,పక్షవాతం,ఆక్సిడెంట్ మరియు నరాల ఎమర్జన్సీసేవలు కాంప్లికేటెడ్ అండ్ నార్మల్ డెలివరీకేసులు ఈ ఆసుపత్రికి ప్రత్యేకం..అత్యవసరపరిస్థితులలో అన్నివేళల అందుబాటులో !!నంద్యాలక్రిటికల్ కేర్ సెంటర్ !!రైతుబజారు ఎదురుగా !!టిటిడి కల్యాణ మండపంరోడ్డు వద్ద సేవలు అందిస్తోంది ..!