ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
- నంద్యాల ఎంఎల్యే అవినీతిని బయటపెట్టిన వైసిపి రెబల్ నేత గోకుల్ కృష్ణా రెడ్డి
అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధికార పార్టీ ఎంఎల్యే చేస్తున్న అవినీతిని ఆపార్టీకి చెందిన రెబల్ నేత, వైసిపి జెడ్పిటిసి సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి బయట పెట్టారు. శనివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎంఎల్ ఎ శిల్పారవిచంద్ర అవినీతి చిట్టా ఇదేనంటూ గోకుల్ కృష్ణ రెడ్డి మీడియాకు వివరించారు. నంద్యాల మున్సిపాలిటీలో ఎంఎల్ ఎ తన ఇంటి పని మనిషి అయిన ప్రసాద్ ను మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమించి… అతనిని తన సొంత పనులకు, ఇంటి పనులకు వినియోగించుకుంటూ మున్సిపాలిటీ ద్వార జీతం తీసుకుంటున్నాడని గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు.ఇందుకు రుజువుగా ఎంఎల్ ఎ ఇంట్లో పని చేస్తున్న ప్రసాద్ ఐరిష్ ద్వారా మున్సిపల్ కార్యాలయం వద్ద హాజరు వేస్తున్న ఫోటోను ఆయన మీడియాకు చూపించారు.
గత కొన్నేళ్ళుగా నంద్యాల మున్సిపాలిటీ శిల్ప కుటుంబ కబంధహస్తాల్లో చిక్కుకుందని గోకుల్ కృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇదే విధంగా నంద్యాల మున్సిపాలిటీలో చాలామంది శిల్ప సన్నిహితులు,.. మున్సిపల్ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని , మరి కొంతమంది వివరాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతామని గోకుల్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో ఓ వార్డ్ కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్ అడ్డదారిలో ఉద్యోగిగా కొనసాగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయాన్ని గోకుల్ కృష్ణా రెడ్డి ప్రస్తావించారు. నంద్యాల ప్రాంత ప్రజలు పన్నుల రూపంలో డబ్బు చేల్లిస్తుంటే… ఎంఎల్ఎ.. ఆయన అనుచరులు అడ్డదారిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గోకుల్ కృష్ణా రెడ్డి దుయ్యబట్టారు. నంద్యాల మున్సిపాలిటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న,, పట్టించుకోకుండా… మరో వైపు ఇదికదా? అబివృద్ది అంటూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఇప్పుడు బయటకు వస్తున్న అవినీతిని చూస్తుంటే… ఇది కాదా? అవినీతి అని నంద్యాల ప్రజలు నవ్వుకుంటున్నారని గోకుల్ ఎద్దేవాచేశారు.
మరోవైపు, మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురువుతున్న ఎంఎల్ ఎ ఏమాత్రం పట్టించోకోవడం లేదంటే… నంద్యాల పరిధిలో జరుగుతున్నఅవినీతి, భూ కబ్జాల వెనుక ఎంఎల్ ఎ రవి, మాజీ మంత్రి హస్తం ఉంటుదని తాము భావిస్తున్నట్టు గోకుల్ కృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఎవడబ్బ సొమ్మని నంద్యాల ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును తమ ఇంటి మనుషులకు, అనుచరులకుపంచిపెడతారని గోకుల్ కృష్ణా రెడ్డి, స్టానిక ఎంఎల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నంద్యాల మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి పై తాను యెంత వరకైనా వెళ్ళడానికి సిద్దమని గోకుల్ రెడ్డి స్పష్టం చేశారు.