ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
మహానంది
అడవి జంతువులకు సంబంధించిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మండలంలోని గోపవరం గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటను అటవీ జంతువుల నుండి రక్షణ కోసం పంట పొలం చుట్టూ వైర్ ను అమర్చి దానికి అనధికారికంగా విద్యుత్తు సరఫరా చేయడంతో అటుగా వచ్చిన అటవీ జంతువు లు విద్యుత్ తగిలి చనిపోయినట్లు తెలుస్తుంది. చనిపోయిన అటవీ జంతువుల మాంసాన్ని గుర్తించి మాంసాన్ని ముక్కలుగా తయారుచేసి కొంత భాగాన్ని వంట తయారీకి మరికొంత విక్రయానికి వినియోగిస్తున్న సమయంలో అటవీ శాఖ దాడులు చేసి గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోనికి విచారించి కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.