ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
#మహానందిలో టిడిపి మండల కార్యాలయం ప్రారంభం
#మహానందికి చెందిన 69 కుటుంబాలు టిడిపిలో చేరిక
మహానందిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంను మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ముందుగా మహానందికి విచ్చేసిన ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం మహానందికి చెందిన 69 కుటుంబాలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు.వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానందిలో తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం ప్రారంభించడం ఎంతో అభినందించదగ్గ విషయమని తెలిపారు.తెలుగుదేశం పార్టీలో 69 కుటుంబాలు చేరడం శుభ పరిణామం అని,వీళ్ళందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన అనేకమంది టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త తమ శాయ శక్తుల కృషి చేయాలని తెలిపారు.వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని బుడ్డా ధీమా వ్యక్తం చేశారు.