ప్రజా టివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు
హాస్టల్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ జారీ
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ ను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ డా.కె శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే జిల్లా కలెక్టర్ బొమ్మల సత్రం ఏరియాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర కాలేజ్ హాస్టల్ ను తనిఖీ చేశారు. వసతి గృహంలో కాలేజీ విద్యార్థులు మినహా అనధికారిక ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజన పదార్థాలు సమయానికి ఇస్తున్నారా లేదా అనే అంశాలపై ఆరాతీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ తనిఖీ సమయంలో వార్డెన్ హాస్టల్లో లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ వెంకటేశ్వర్లుకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడిని చరవాణి ద్వారా కలెక్టర్ ఆదేశించారు.