గుంటూరు సెప్టెంబర్ 18(ప్రజా న్యూస్): వినాయక చవితి వేడుకలు గుంటూరు పట్టణంలో అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి.పట్టణంలో వాడవాడలా గణనాధుని విగ్రహం ఏర్పాటు చేసి గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు..పట్టణంలోని ముత్యాలరెడ్డి నగర్ లో వీధి వీధిలోనే కాక పలు అపార్ట్మెంట్ లలో గణనాధుని విగ్రహాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు..ముత్యాల రెడ్డి నగర్ మూడవ లైన్లో వీధిలో ఏర్పాటు చేసిన విగ్రహం మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..మూడవ లైన్ దేవ్ క్యాజల్ అపార్ట్మెంట్ వాసులు చవితి వుత్సవలు ఘనంగా నిర్వహించారు..ఆ అపార్ట్మెంట్ లో మహిళలు అందరూ గణనాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహించి చవితి వేడుకలు నిర్వహించి సామూహిక పంక్తి భోజనాలు చేశారు…మొత్తం మీద పట్టణం అంతా విద్యుత్తు దీపాలు అలంకరణ తో వీధి వీధిలో గణపతి పప్పే నామ స్మరణ తో వేడుకలు జరుగుతున్నాయి