నంద్యాల నవంబరు23(ప్రజా న్యూస్):నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన స్మశానం కి కేటాయించిన 50 సెంట్లు స్థలాన్ని కొందరు వ్యక్తులు పొలం మాదేనంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.. సర్వే నెంబర్ 110 లో ఏళ్ళ క్రితమే స్థలం మా పేరున ఉందంటూ ట్రాక్టర్ తో చదును చేసుందుకు ప్రయత్నించారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు గుంటుపల్లి హరిబాబు మధుసూదన్ రెడ్డి బొర్రా సుబ్బారావు తదితురులు వారిని అడ్ఫుకున్నారు…ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అయ్యలూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి మహేశ్వరరెడ్డి మరికొందరు వచ్చి తమ గ్రామానికి చెందిన స్మశాన స్థలాన్ని తమాదంటూ ఆక్రమించే ప్రయత్నం చేశారని వారిని అడ్డుకున్నామన్నారు..తహసీల్దార్ రవికుమార్ గ్రామీణ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు…అధికారులు చర్యలు తీసుకుని తమ గ్రామ స్మశాన వాటిక అన్యా క్రాంతం కాకుండా కాపాడాలని వారు కోరారు