నకిలీ చలాను కేసులో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్టర్ సోఫియాబేగం సస్పెన్షన్?

నంద్యాల ఆగష్టు12(ప్రజాన్యూస్):రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో చెలరేగిన నకీలీ చలాను కుంభకోణం లిస్ట్ లో కర్నూలు జిల్లా నంద్యాల కు స్తానం దక్కింది..విజిలెన్స్ దర్యాప్తులో నంద్యాల సబరిజిస్ట్రార్ సోఫియాబేగం తో పాటుగా జూనియర్ అసిస్టెంట్ వీరయ్య కు సైతం పాత్ర ఉన్నట్లు విచారణ లో గుర్తించారు..దీంతో రిజిస్ట్రేషన్ శాఖ డి ఐ జి ఆదేశాలమేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అక్రమాల పాత్ర ఉన్న సిబ్బిందిపై వేటు పడింది..దీంతో నకిలీ చలనా కుంభకోణం లో నంద్యాల సబ్ రిజిస్టర్ సోఫియాబేగం తో పాటుగా జూనియర్ అసిస్టెంట్ వీరయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ కుంభకోణం లో స్టాంప్ రైటర్ ల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది… వీరిపై క్రిమినల్ కేసులకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం…కాగా మరి కొద్ది రోజులలో సోఫియాబేగం పదవీవిరమణ చేయాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *