అమరావతి ఆగస్టు11(ప్రజాన్యూస్):ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డిొ ఆళ్లగడ్డ ఎంఎల్ ఎ గంగుల బిజేంద్రారెడ్డి బుదవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిని కలిశారు..ఈసందర్బంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ అబివృద్ది డిటయిల్డ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రికి వారు అందించారు..
ఆళ్లగడ్డ పట్టణంలోని సంబంధించి సిమెంట్ రోడ్లు మరియు మరియు డ్రైన్లు కొరకు 24 కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా చింతకుంట్ల చెరువును పార్కు గా తీర్చిదిద్దడానికి 4.9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిదులు మంజూరు చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు..ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.