కర్నూలు ఆగస్టు 10(ప్రజాన్యూస్): నంద్యాలలో యూట్యూబ్ విలేఖరి కేశవను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, నాగేశ్వరరావు (నాని)లకు 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింది.నిందితులను ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.