కర్నూలు ఆగష్టు 9 (ప్రజాన్యూస్): నంద్యాల పట్టణంలో వి5 రిపోర్టర్ గా పనిచేస్తున్న కేశవ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.. కేశవ హత్య వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది…సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరంరాష్ట్ర,జిల్లాడివిజనుశాఖలుస్పందించాయి…నంద్యాల వి5 రిపోర్టర్ కేశవ హత్య దురదృష్ట సంఘటన అని భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ఆర్గ నైసింగ్ సెక్రటరీ ప్రభాకర్ చౌదరి,జిల్లా కార్యవర్గ సభ్యులు జెమిని మధు,షరీఫ్,డివిషన్ అధ్యక్ష కార్యదర్సులు శ్రీనివాసులు,సతీష్ తీవ్రంగా ఖండించారు..భాదితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగ వుండాలని ,హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీని ,నంద్యాల డి ఎస్ పిని కోరారు.