ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాలజూలై30(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లా నంద్యాల డివిజన్ లో మునిసిపల్ రెండవ వైస్ చైర్మన్ పదవులు వైసిపి ఖాతాలోచేరాయి..నంద్యాలమునిసిపల్ రెండవ వైస్ చైర్మన్ ఎంపిక శుక్రవారం ఎన్నికల అదికారి జెసి రాంసుందరరెడ్డి అద్యక్షతన స్థానికమునిసిపల్ కార్యాలయంలో జరిగింది..ఎన్నిక అజెండాను ఎన్నికలఅదికారిగా వ్యవహరించిన జెసి చదివి వినిపించారు..వైస్ చైర్మన్ గా గెలుపొందిన వార్డు కౌన్సిలర్లలో ఒకరు ప్రతిపాదించాలని ఓకరు బలపరచాలని జెసి రాంసుందరరెడ్డి సూచించారు..దీంతో ఎంఎల్ ఎ శిల్పారవిచంద్రారెడ్డి సతీమణి 36 వవార్డు వైసిపి కౌన్సిలర్ శిల్పానాగినిరెడ్డి 28 వవార్డు వైసిపి కౌన్సిలర్ పాంషావలినిప్రతిపాదించగా 16వవార్డు వైసిపి కౌన్సిలర్ విజయభాస్కర్ పాంషా వలిని బల పరిచారు..ఎవరూ పోటీలేకపోవడం అబ్యంతరాలు లేకపోవడంతో రెండవ వైస్ చైర్మన్ గా పాంషావలి ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల అదికారిా జెసి రాంసుందరరెడ్డి ప్రకటించారు..దీంతో 28 వవార్డు వైసిపి కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..అనంతరం పాంషావలి మాట్లాడుతూ ముఖ్యమంత్రిజగన్ చట్టసభల్లోె బిసి ఎస్ సి ఎస్టి లకు 50శాతం రిజర్వేషన్ పెట్టడంవల్లే తాను వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యానన్నారు.తన ఏకగ్రీవ ఎంపికకు కృషిచేసిన మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డికి,ఎంఎల్ ఎ శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డికి, వైసిసి నేత బాచంజగదీశ్వరరెడ్డికి, సుదాకరరెడ్డికి తాను ఎంతో రుణపడి ఉంటానని తనపై ఉంచిన భాద్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఈసందర్బంగా పాంషావలి తెలిపారు..