మారంరెడ్డి జనార్దనరెడ్డి సీనియర్ జర్నలిస్టు
హైదరాబాదు జూలై 27(ప్రజాన్యూస్):
జానపద గేయని మంగ్లీ పై వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం ఆమెను మరింతబలోపేతం చేస్తున్నది..గత రెండు మూడు ఏళ్లనుంచి రెండు రాష్ట్రాలలో టాప్ 5 గాయకుల్లో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్న మంగ్లీ అలియాస్ సత్యవతి రాదోడ్ పై ఇటీవల జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆమె అభిమానులుచేస్తున్న ప్రయత్నంలో సూపర్విజయంసాదించారు..ఇప్పుడు కొనసాగుతున్న ర్యాంక్ లో మంగ్లీ మరో 10 ఏళ్లు కొనసాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానంఅక్కర్లేదంటున్నారుమంగ్లీఅభిమానులు..టాప్10లోకొనసాగేఏరంగంలోఅయినతమతప్పులుతెలసుకోవడానికివిమర్శలుఅవసరంఅనిమేదావులుచెబుతున్నారు. .
.అయితే మంగ్లీ ఇటీవల పాడి నాట్యం చేసిన *చెట్టు కింద కూర్చున్నావమ్మా *అనే పాటను కొందరు వివాదంచేశారు.సోషియల్ మీడియాలో అయితే కొందరు మంగ్లిని కించపరిచే పోస్టులు చాల పెట్టారు.విమర్శలుచేస్తున్న వారు ఇంతవరకు పాడిన అందరు గాయకులుపాడిన పాటలను వారికోణంలో పరిశీలిస్తే 90శాతం పాటలపై విమర్శలు చేయవచ్చు..కాని లక్షలాది మంది ప్రజల హృదయాలను దోచుకునే పాటలు పాడే ఏగాయని గాయకులు పై విమర్శలు చేసి వారిని మెత్తపడగొట్టడం కంటె వారికి సలహా ఇచ్చి సవరణచేసుకోమని చెబితే సరిపోతుంది.మంగ్లీ విషయంలో ఇలాచేసిఉంటే ఆమెకు ఇంత ఆదరణ లభించేదికాదు..10 ఏళ్లనుంచి ఎన్నోరకాలుగా కష్టపడిదేవతలపై మనసుల్లో చిరస్థాయిగా నాటుకొనిపోయే పాటలు పాడిన మంగ్లీ పై చేసిన ఆరోపణలను ఎవరూ ఖాతరుచేయకపోగా తాము అండగా ఉంటామని మహిళా ప్రేక్షకులు తోపాటుగా ఇతరులు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఆమెకు రెట్టింపు బలంచేకూరుతున్నది..వివాదం చెలరేగిన తరువాత కూడా మంగ్లీ తనపై విమర్శలు చేస్తున్న వారిని ఏమాత్రం రెచ్చగొట్టకుండా హుందాగా వివరణ ఇవ్వడం ఆమె హుందాతనానికి నిదర్శనం..300కిపైగా పాటలు రాసిన రామస్వామిగారి మనస్సు నొప్పించవద్దు అంటూ పదేపదే మంగ్లీ వివరించడం పలువురిలో సానుభూతి కలిగిస్తోంది..పాటపై విమర్శలు చేయడం తప్పుకాదు అయితే ఆమె ఇమేజిని దెబ్బతీసే విదంగా కుట్రలు చేయడం మంచి పద్దతి కాదని పలువురు అబిప్రాయపడుతున్నారు..తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని మంగ్లీ విషయంలో తేలింది..మంగ్లీ కోటి విమర్శలను స్వీకరిస్తూ ఇదే దూకుడును పాటల్లో కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు