నంద్యాల జూలై23(ప్రజాన్యూస్): నంద్యాలలో మోటార్ సైకిల్.. గోస్పాడు లో చలనా.. ఇదేంటి అనుకుంటున్నారా? డోంట్ వర్రీ ..మన పోలీసు లు టార్గెట్స్ రీచ్ అయ్యే ఆదుర్దాలో ఫైన్ వేస్తున్నా రో …లేక ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్ వేరు యూస్ చెయ్యడము కుదరక తప్పులు చేస్తున్నారో తెలియదుగానీ. ఈ మధ్య వీరి నిర్వాకంతో అమాయకులు బలి అవుతున్నారు..ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదనో,మాస్క్ పెట్టు కోలేదనో హెల్మెట్ పెట్టలేదనో, పార్కింగ్ లేనిచోట పార్కింగ్ చేశారనో,లైసెన్సు లేదనో ట్రాఫిక్ పోలీసులతో పాటుగా మండల పరిధిలో ఎస్ ఐ లు సబందిత వాహన దారుడిని నిలిపి సెల్ లో ఫోటి తీసి చలనా వారి సెల్ నెంబర్ కి మెసేజ్ వెళ్లే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.. ఇదంతా ఓకే అంతా మన మంచికే…అయితే కొందరు పోలీసులు మాత్రం ఇమేజ్ డాటా ఎంట్రీ తప్పులు తడకగా ఎంట్రీ చేస్తుండటంతో సంబంధంలేని వ్యక్తులకు పేనాల్టీలు పడుతున్నాయి..ఈ సమస్య పై ఎంతో మంది ఇబ్బంది పడినా ఎవరికి చెప్పుకోవాలో తెలియక తప్పని పరిస్తులలో ఫైన్ చెల్లిస్తున్నారు… తాజాగా ఓ సీనియర్ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది…ఇక వివరాలలోకి వెళితే. గోస్పాడు పోలీసులు ap21bb0080 నెంబర్ గల టు వీలర్ పై వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టలేదంటూ బైక్ ఇమేజ్ తీశారు…అయితే చలనా నెంబర్ మాత్రం ap21bb0800 వేశారు…ఈ నెంబర్ గల బైక్ నంద్యాల సీనియర్ జర్నలిస్టు జెమిని మధుసూదన్ రావుది..దీంతో చలనా మొత్తం చెల్లించాలని సదరు జర్నలిస్ట్ కి మెసేజ్ వచ్చింది…కంగుతున్న జర్నలిస్టు తాను అసలు వర్షాలు కు బయటకి వెళ్లడంలేదు.. ఫైన్ ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తే గోస్పాడు పోలీసులు ఫైన్ విదించినట్లు తేలింది.. విషయాన్ని గోస్పాడు ఎస్ ఐ దృష్టికి తీసుకు వెళితే మీరు నంద్యాలలో ఉంటే మీ బైక్ ఎవరికో ఇచ్చి వుంటారు మేము ఏమి చేస్తా మని తీరిగ్గా జవాబు ఇచ్చారు ఎస్ ఐ గారు..పైపెచ్చు నీ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని చూడు అంటూ బైక్ ఇమేజ్ పోస్ట్ చేసారు…అయ్యో మేడం అది నా బైక్ కాదు అంటే అయితే నీకు చలాను నేను వేయలేదు అంటూ సమాచారం ఇచ్చారు.. కనీసం ఏమి జరిగింది… ఎందుకు జరిగింది అని కూడా చూడకుండాతప్పుగా ఎంట్రీ చేసిన ఇమేజ్ జర్నలిస్ట్ కి ఫార్వార్డ్ చెయ్యడం కొసమెరుపు.. మరి బండి ఒకరిది ఫైన్ ఒకరికి ఈ నిర్వాకం గోస్పాడు పోలీస్ ఎలా సరి చేస్తారో చూద్దాం… ఇలాంటి తప్పులు జరిగకుండ ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచిచూద్దాం