కర్నూలు జూలై13(ప్రజాన్యూస్):తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలమేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆయా కలెక్టరు కార్యాలయాల ఎదురు నిరసనలు తెలిపారు..ఇందులోభాగంగా కర్నూలు జిల్లాలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి ఆద్వెర్యంలో జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జి లు కలెక్టర్ ఆఫీస్ లో జేసికి వినతిపత్రం అందించారు..జిల్లాలో పెండింగులో ఉన్న నీరు చెట్టు బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా వారు జేసీ శ్రీనివాసులును కోరారు..కార్యక్రమంలోమాజీ ఎం ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి,నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్,కర్నూలు పార్లమెంట్ నేతలు కోట్ల సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు