శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి శ్రీశైలం 

కర్నూలుజూలై11(ప్రజాన్యూస్): శ్రీశైలం జలాశయానికి  ఎగువనుండి వచ్చేవరద నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా…ఔట్ ఫ్లో 7,063 క్యూసెక్కులుగా నమోదు

అయ్యింది. అలాగే జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం 810 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను…ప్రస్తుత నీటి నిల్వ 34.3371

టీఎంసీలుగా ఉంది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటలలో 3.227 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను టీఎస్ జెన్ కో ఉత్పత్తి చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *