నంద్యాల(యాళ్లూరు)జూలై7(ప్రజాన్యూస్):నంద్యాల నియోజకవర్గంలోని ఏ పల్లెలోనైన వైద్యం అందక ప్రాణం పోకూడదని ఎం ఎల్ ఏ శిల్పా స్పష్టం చేశారు.
గోస్పాడు మండలం యాళ్లూరు లో అంగరంగ వైభవంగా జరిగిన 30 పడకల ఆసుపత్రి(సామాజిక ఆరోగ్య కేంద్ర) ఆధునీకరణ కార్యక్రమానికి ఆయన భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు వైసీపీ నేతలు ఎం ఎల్ ఏ కి ఘన స్వాగతం పలికారు
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గతం లో తెలుగుదేశం నాయకులు యిచ్చిన హామీలను మరిచి పోవడం వల్లనే ప్రజలు తరిమికొట్టారని
చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేసారన్నారువైసిపి అధికారంలోకి వచ్చాక యిచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతుందని గ్రామాలను అభివృద్ధి చేసేవిధంగా ముఖ్యమంత్రి జగనన్న ముందుకు తీసుకోపోతున్నారన్నారు యాళ్లూరు గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని అలాగే అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే ధరఖాస్తు చేసు కోవాలన్నారు
నవరత్నలు ప్రవేశపెట్టి ప్రతి రత్నం ప్రజలకు చేరేవిధంగా సచివాలయలు ప్రవేశపెట్టి వార్డు వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు…
- రూ.533.00లక్షల అంచనావ్యయంతోనిర్మిస్తున్న నూతన భవనం యాళ్లూరు గ్రామానికి రావడానికి కృషిచేసిన ప్రియతమ ముఖ్యమంత్రి CM YS జగన్ మోహన్రెడ్డికియాళ్లూరుగ్రామప్రజలతరుపునప్రత్యేకధన్యవాదాలుతెలుపుతున్నామన్నారు …అనంతరం ఆయన శిలాపకాలన్నీ ఆవిష్కరించారు… కార్యక్రమంలో ఎంపి పోచ బ్రహ్మా నందరెడ్డి,మార్క్ ఫెడ్ పిపి నాగిరెడ్డి,అధికారులు వైసీపీ నేతలు పాల్గొన్నారు


