కర్నూలు జూలై5(ప్రజాన్యూస్):శ్రీశైౌలం దేవస్థానం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్ కెమెరా తిరుగుతుంది. క్షేత్రపరిధిలోని డంపింగ్ యార్డ్ దగ్గర డ్రోన్ తిరిగింది. అత్యంత వేగంగా డ్రోన్ కెమెరా కదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. జాడ కనిపెట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.డ్రోన్ వ్యవహారంపై ఇఓరామారావు పోలీసులకు పిర్యాదుచేశారు..పిర్యాదుతో అదికారులు అప్రమత్తమయ్యారు..