దేశమంతటా… సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థ : రిలయన్స్‌ జియో…

ముంబై : రిలయన్స్‌ జియో ఇన్పోకామ్‌ లిమిటెడ్‌… అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌ వ్యవస్థను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ భాగస్వాములు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ సరఫరా సంస్థ సబ్‌కామ్‌ భాగస్వామ్యంతో సముద్రంలో భారత్‌ అంతటా విస్తరించేలా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది.

ఎప్పటికప్పుడు అనూహ్యంగా పెరిగిపోతోన్న డేటా డిమాండును తట్టుకునే క్రమంలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని, ఈ కేబుల్‌ వ్యవస్థ సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేషియా, ఇటలీ, మధ్య, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల మీదుగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్లతో భారత్‌కు అనుసంధానమవుతుంది. మరో రెండేళ్ళలో(2023 ద్వితీయార్ధానికి) భారత్‌-ఆసియా ఎక్స్‌ప్రెస్‌ (ఐఏఎక్స్‌) సిస్టమ్‌ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్‌ జియో పేర్కొంది.

టెలికం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో… తాజా ప్రాజెక్టు ద్వారా మరో ఘనతను సాధించబోతోంది. పెరుగుతున్న డేటా అవసరాలను దృష్ట్యా రిలయన్స్… ఈ భారీ సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుళ్ళతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేయనున్నారు. సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యముంటుంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా.. పశ్చిమాన ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని ఈ ప్రాజెక్టులో భాగంగా అనుసంధానించనున్నారు. రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్‌ఇంటర్ ఎక్స్ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదారులు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రాజెక్టులు అందుబాటులో ఉంటాయని జియో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *