ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి![]()
నంద్యాల,04 జనవరి 2025(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వెండి చోరీ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రూ.14.76 లక్షల విలువైన వెండిని స్వాదీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు

నిందితులను మీడియా ముందు హాజరు పరిచి అనంతరం మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఎస్ పి సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ, మాజీ ఈ.వో భాగవతం వెంకట నరసయ్య,దూదేకుల పెద్ద హుస్సేనయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అర్చకుడు కిషోర్ శర్మ స్వామివారి నిజమైన ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వాటి స్థానంలో గిల్టు నగలను ఉంచినట్లు వైకుంఠ ఏకాదశి రోజున బయటపడడంతో ప్రస్తుత ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కేవలం వారం రోజుల లోపే కేసును చేదించి స్వామి వారి వెండిని రికవరీ చేసేందుకు కృషి చేసిన ఆళ్లగడ్డ DSP కె. ప్రమోద్ రూరల్ CI బి.వి. రమణ. చాగలమర్రి SI సురేష్ లను ఎస్పీ అభినందించారు. నిందితులను జ్యూడిషల్ రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ సునీల్ శరన్ తెలిపారు.