నంద్యాల జిల్లా ఎక్సెటెన్షన్ మరియు మాస్ మీడియా అదికారిగా భాద్యతలు స్వీకరించిన మల్లే పల్లి పామన్న

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 01జనవరి 2026(ప్రజాన్యూస్) :

నంద్యాల జిల్లా ఎక్సెటెన్షన్ మరియు మాస్ మీడియా అదికారిగా మల్లే పల్లి పామన్న గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పదవీ బాద్యతలు స్వీకరించారు..

అనంతపురం మెడికల్ కాలేజీలోని ఎస్ పి ఎం డిపార్ట్ మెంటులో భోదకుడిగా పనిచేస్తూ డిప్యూటి డెమోగా మల్లేపల్లి పామన్న పదోన్నతి పొందారు..ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నంద్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పామన్నను నియమించింది..ప్రభుత్వ ఆదేశాలమేరకు పామన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణను కలిసి బాద్యతలు స్వీకరించారు..పదోన్నతిపై నంద్యాలజిల్లాలో అదికారిగా బాద్యతలు స్వీకరించిన మల్లేపల్లి పామన్నను హెల్త్ ఎక్సెటెన్షన్ ఆపీసర్ శివరామయ్య తోపాటుగా వైద్యశాఖకు చెందిన నరసప్ప రామగురప్ప లక్ష్మినారాయణ జగదీష్ హరినాదరెడ్డి తదితరులు అభినందించారు..ఈ సందర్బంగా పామన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలమేరకు చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *