♦ప్రజాటివి ప్రతినిది ప్రబాకర్ చౌదరి
రైతుల న్యాయమైన ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న అనుచిత వైఖరిని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..యావత్ భారతదేశ రైతుల హక్కులకై పోరాడుతున్న పంజాబ్ రైతులపై పోలీసు బలగాలతో కేంద్ర ప్రభుత్వం విచక్షణారహితంగా బాష్పవాయువు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి యువ రైతు మరణానికి, వందలాది రైతులు గాయపడం పట్ల దశరథరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతాంగ హక్కులకై పోరాటంలో చనిపోయిన రైతులకు ఆయన ఘన నివాళిని అర్పించారు.
స్వామినాథన్ కమీషన్ రిపోర్ట్ లోని కీలకమైన వ్యవసాయ ఉత్పాదనలకు కనీస మద్దతు ధరను కల్పిస్తామని, 2014 ఎన్నికల ప్రణాళికలో బిజేపి ప్రకటించాడాన్ని ఆయన గుర్తుచేసారు. కనీసం మద్దతు ధరను అమలు పరుస్తామని ప్రకటించి పది సంవత్సరాలైనా, ఆ దిశగా అడుగులు వేయని కేంద్ర ప్రభుత్వాన్ని రైతాంగం ప్రశ్నించడాన్ని సహించక, రైతులపై దాడులుకు దిగడంపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఒక వైపు స్వామినాథన్ కు భారతరత్న అవార్డునిస్తూ, మరొక వైపు స్వామినాథన్ కమీషన్ రిపోర్ట్ అమలుకై పోరాడుతున్న రైతుల జీవితాలతో చెలగాటమాడటం బిజెపి ద్వంద్వ వైఖరిని ప్రస్పుటం చేసిందని విమర్శించారు. ఇక నైనా రైతులపై దాడులను ఆపి, రైతుల న్యాయమైన వ్యవసాయ ఉత్పాదనలకు కనీస మద్దతు ధర హక్కులు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేసారు.
కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలనీ, స్వామినాథన్ కమీషన్ సిఫారసును అమలు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలకు రాయలసీమ సాగునీటి సాధన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఈ సందర్భంగా బొజ్జా ప్రకటించారు. ఈ విషయంపై తమ పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశాన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్ట్ లో పొందుపరచాలని డిమాండ్ చేశారు.