ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
“మాతృభాషలను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత”
స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవo సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో నంద్యాల పట్టణ ప్రముఖ న్యాయవాది సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస మూర్తి ఆచార్యులు, మాతృభాష పరిరక్షణ కార్యదర్శి తెలుగు ఉపాధ్యాయులు శ్రీ అన్యం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెలుగు తల్లి కి పుష్పమాలాధరణతో కార్యక్రమాo మొదలైంది.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి ఆచార్య జీ మాట్లాడుతూ భారతదేశం లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే నలంద వంటి విశ్వవిద్యాలయంలో చైనా గ్రీకు ఐరోపా వంటి దేశాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఈ విద్యాలయంలో విద్యనభ్యసించారని ఆ కాలంలోనే దాదాపుగా పదివేల మంది విద్యార్థులు నలందా విశ్వవిద్యాలయంలో సంస్కృతము ,వ్యాకరణము, వేదాలు, ఉపనిషత్తులు, వంటి గ్రంథాలను చదివి ఆ విజ్ఞానాన్ని తమ దేశాలకు తీసుకుని వెళ్లి వారి దేశాభివృద్ధికి పాటుపడ్డారని, భారతదేశం అతి ప్రాచీన సాంస్కృతిక కళ వైభవ నాగరికతలకు నిలయమని అన్నారు. అందువలన మనము అంతర్జాతీయ మాతృభాష దినోత్సవo సందర్భంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని ప్రాచీన విద్యా విధానం, గురుకుల విద్యా విధానం ఎంతో గొప్పదని “పరభాషలను ఎన్నైనా నేర్చుకో కానీ అమ్మ భాషను మరువకూడదు”.మనకు ఏమీ తెలియని ఎన్నో విషయాలు అలవర్చుకున్నాము కానీ అన్ని తెలిసిన తర్వాత కూడా కొంత మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే తమ కళాశాలలో ఆచార్యజీ, మాతాజీ అని అధ్యాపకులను పిలవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. త్యాగయ్య వేమన వంటి ఎంతోమంది మహానుభావులు ప్రాంతీయ భాషల సంస్కృతి వైభవాలకు ప్రయత్నం చేశారని ఆ ప్రయత్నాల ఫలితంగా ఈనాడు మనము జీవిస్తున్నామని కాబట్టి భారతదేశంలోని ప్రాచీన కళారూపాలను కానీ సంస్కృతి ఆచార వ్యవహారాలను ఆచరించడానికి అనుసరించడానికి ప్రదర్శనల రూపంలో తమ కళాశాలలోని విద్యార్థులు నేర్చుకోవాలని అభిలాషించారు. తెలుగు వంటి భాషలు మరుగున పడిపోకుండా మృత భాషగా మారకుండా మనమందరం ప్రయత్నం చేయాలని అన్నారు. ఇప్పటికే ఎన్నో భాషలు అంతరించిపోయాయి తెలుగు వంటి భాషలకు ఆ ప్రమాదం పొంచి ఉన్నది అందువలన నూతన విద్యా విధానంలోనైనా మన ప్రాచీన కళా వైభవం ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని పిలుపు నిచ్చారు..ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాచీన కళారూపాలు రాముడు, కృష్ణుడు, రావణుడు, హనుమ, జంగమయ్య వేషధారణ వేసిన మొదటి సంవత్సరo విద్యార్థులు విజయకుమార్ పవన్ కళ్యాణ్ పవన్ వెంకట సునీల్ సి . పవన్ లను అభినందిస్తూ వారిని మెడల్స్ తో సత్కరించారు.
ముఖ్య వక్తలుగా విచ్చేసిన శ్రీ శ్రీనివాసమూర్తి ఆచార్యులు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం లో విద్యార్థులు చదువుతూ తెలుగు వంటి మాతృభాషలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మాతృభాషలో చదివితే చదువుతోపాటు విజ్ఞానము వ్యక్తిత్వము అలవడుతుందని అన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు మాతృభాష పరిరక్షణ కార్యదర్శి శ్రీ అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు వంటి భాషలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పివి నరసింహారావు వంటి మహానుభావులు అనర్గళంగా దాదాపు 14 భాషలలో మాట్లాడే వారిని అలాంటి గొప్ప వారికి జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం సంతోషమని రామకృష్ణ విద్యా సంస్థలలో చదువుతూ ఎంతో మంది విద్యార్థులు ఉన్నతమైన పదవులను పొంది తెలుగు వంటి భాషలకు ఎన్నో సేవలు చేస్తున్నారని అన్నారు వేమన వంటి కవి మన తెలుగు వారు కావడం మన అదృష్టం అని శతక మధురిమ, సహస్రావధానము, తీయనైన తెలుగు మాటలతో కూడిన పాటలు ఎన్నో తెలుగు బాషా సంపదని ఇంగ్లీషు, హిందీ తమిళం కన్నడ వంటి ఎన్నో భాషల పదాలను అవలీలగా తనలో కలుపుకొని జీవ నిత్య నూతనంగా ముందుకు కొనసాగుతుందని అన్నారు. కాబట్టి తెలుగు భాష మధురిమను గుర్తించాలని అన్నారు .కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆచార్యులు మాట్లాడుతూ మాతృభాషలను పరిరక్షించుకొని విస్తృతంగా వ్యాప్తిని చేయడంలో విద్యార్థుల పాత్ర గణనీయమని అన్నారు కళాశాల ఎస్టేట్ మేనేజర్ శ్రీ మతి ప్రగతి మాతాజీ మాట్లాడుతూ ఇంగ్లీష్ వంటి భాషలు ఉపాధికి తోడ్పడతాయని కానీ తెలుగు వంటి భాషలు వ్యక్తిత్వాన్ని నేర్పుతాయని ఆ వ్యక్తిత్వంతో మీరు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించవచ్చని అన్నారు చిన్నతనంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మనము రైమ్స్ నేర్చుకొని ఉంటాము కానీ వేమన వంటి కవులు వాస్తవాన్ని ఒక పెద్ద కొండను చిన్న అద్దంలో చూపించినట్టుగా ఉప్పు కర్పూరానికి ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో చక్కగా వివరించి చెప్పారు.” తినగా తినగా వేము తీయగా ఉండు” ఇలాంటి అంశాలు మాతృభాష తెలుగు వంటి భాషలోనే ఆ తీయదనాన్ని మాధుర్యాన్ని పొందగలమని అన్నారు.
కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన జానపదం ప్రాచీన కళారూపం కోలాటం డాన్సు ను ప్రదర్శించారు.విద్యార్థులు వేసిన ప్రాచీన ఇతిహాసపు కళారూపాలు రాముడు, కృష్ణుడు ,రావణుడు, హనుమ, జంగమయ్య వేషధారణ అందరిని ఆకర్షించాయి.కార్యక్రమంలో ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు విభాగము అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, ఎల్లయ్య, బాలరాజు, సుధీర్ రెడ్డి, మోహన్రావు, శ్రీమతి వరలక్ష్మి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.