ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
అహోబిళం..నవనరసింహక్షేత్రాలు..మాలోల నరసింహస్వామి
నంద్యాలజిల్లా లోని ప్రముఖ ఆద్యాత్మిక క్షేత్రాలలోొ ఒకటి అహోబిలం..అహోబిలంలో కొలువైన నవనారసింహక్షేత్రాలు ప్రసిద్ది పొందాయి..అందులో మాలోల నరసింహస్వామి మూడవ క్షేత్రం..ఈక్షేత్రం ఎగువ అహోబిళంలో ఉంది..
వేదాద్రి పర్వతం మీదబల్లపరుపుగా ఉన్న ప్రదేశంలో మాలోల నరసింహస్వామి ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది..శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం నుంచి ఉత్తరంవైపు అర కిలోమీటరు దూరంలో ఈ ఆలయం ఉంది..శ్రీ నరసింహస్వామి చెంచులక్షిని వివాహం ఆడి ఇక్కడే ఉండిపోగా వైకుంఠంలో ఉన్న లక్షిదేవి స్వామిని వెదుకుతూ వచ్చి, తన భర్త ఇక్కడ చెంచు లక్షితో ఉండటం చూసి కోపంతో అలిగి దూరంగా ఉన్న ఈ వేదాద్రి పర్వతంపైకి వచ్చి ఉండిపోయింది..స్వామివారు ఇచటికి వచ్చి లక్ష్మీదేవిని బుజ్జగించి ఆమెను ప్రసన్నురాలిని చేసుకుని ఆమెను ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని ప్రసన్న వదనంతో స్వామివారు భక్తులకు దర్శన మిస్తారు..
మా అనగా లక్ష్మిదేవి లోలుడుఅనగా ఇస్టుడు లేక ప్రియుడు..మాలోల అనగా లక్ష్మీప్రియుడు అని అర్ధం..స్వామివారు ఎడమతొడపై లక్ష్మీదేవి కూర్చొండగా తన వామహస్తంతో ఆలింగనము చేసుకున్నట్లుగా మూలవిరాట్టు ఉంటుంది..మహాలక్ష్మీదేవి నరసింహస్వామితో కలిసి కరుణా కటాక్షాలను వెదజల్లే రూపంలో మనకు దర్శన మిస్తుంది..ఈపుణ్య దంపతులను సేవించిన వారు ఇహలోకంలోనేకాదు పరలోకంలోనూ ఆనందం పొందుతారు..ఉదయం 9గంటలనుండి సాయంత్రం 4గంటలవరకు స్వామి దర్శనం చేసుకొనవచ్చు..స్వామిని సేవించిన వారికి శుక్రగ్రహం అనుకూలం కాగలదు అని భక్తుల నమ్మకం..మాలోల గుడి కొండపై భాగాన ప్రహ్లాద బడి కలదు..వీటి మద్యదూరం 1 కిమీ ఉంటుంది..ఇదిప్రహ్లాదునికి విద్యాబ్యాసం బోదించిన స్థలంగా ప్రతీతి..ఇచ్చట యోగా నరసింహస్వామి చక్రత్తాళ్వార్ మొదలగు వారిని కూడా దర్శించుకోవచ్చు
అహోబిళం ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి 20 కిమీ దూరంలో ఉంది..రైలు మార్గం ద్వారా నంద్యాలకు చేరుకుంటే ఇక్కడినుండి ఆర్ టిసి ప్రవేటు బస్సులద్వారా ఆళ్లగడ్డకు చేరుకోవచ్చు..ఆళ్లగడ్డనుండి ఆర్ టిసి బస్సులు ప్రతి అరగంటకు కలవు