నంద్యాల 2023 మే 20 ప్రజాన్యూస్:
ఆధునిక టెక్నాలజీతో అన్నదాత ఆర్ధికాభివృద్దికి కృషిచేస్తామని టిడిపి జాతీయ ప్రదానకార్యదర్శి నారాలోెకేష్ స్పష్టంచేశారు..యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాలపట్టణ శివార్లలో ఏర్పాటుచేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు..టిడిపి రైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబు ఆద్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి విశేష స్పందన లభించింది..
జిల్లావ్యాప్తంగా రైతులు ఈకార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలపై గళం విప్పారు..ఈసందర్బంగా నారాలోకేష్ మాట్లాడుతూ టిడిపి అదికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు వ్యవసాయంలో యువతను బాగస్వామ్యం చేసేందుకు ఆధునిదకి టెక్నాలజీని ముందుకు తీసుకువచ్చి రైతుల ఆర్దికాభివౄద్దికి కృషిచేస్తామన్నారు..పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి రైతన్నలకు అండగా ఉంటామన్నారు..రైతులకోరికమేరకు అలగనూరు బ్యాలెన్నింగ్ రిజర్వాయరు మరమ్మతులకు అదికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి నిపుణుల సలహా తీసుకుని కార్యచరణ రూపొందిస్తామన్నారు..నకిలీ విత్తనాలు పురుగుమందులను అరికట్టి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు.రైతులతో చక్కటి కార్యక్రమం ఏర్పాటుచేసిన ఆసంఘ ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబును సంఘనేతలను ఈసందర్బంగా లోకేష్ అభినందించారు..కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర అద్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిపరూఖ్,మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు రైతుసంఘనేతలు రైతులుపాల్గొన్నారు..