అమరావతి సెప్టెంబరు 09 (ప్రజాన్యూస్):ఆంద్రప్రదేశ్ లోదుల్హన్ పథకం అమలు చేయట్లేదంటూ మైనార్టీ పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
పథకం ఎందుకు అమలు చేయట్లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ్టి విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ సమాధానమిస్తూ.. అక్టోెబరు1 నుంచి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈమేరకు జీవో 39ను ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. అర్హులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.