టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఉండవల్లి లో కలిసిన టిడిపి యువనాయకులు కుందూరు మోహనరెడ్డి
టిడిపి యువనాయకులు గంపరమాన్ దీన్ని ఎంపిటిసి భర్త మాజీ విఆర్ఓ మోహన రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారలోకేశ్ ను గురువారం ఉండవల్లి లోని నారా లోకేష్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు..విలీజి రెవిన్యూ అధికారి అయిన మోహన్‌రెడ్డి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. సిరివెళ్ల మండలం గుంపరమాన్ దిన్నె ఎంపిటిసి స్థానానికి తనభార్య ను ఇండిపెండెంట్ గా పోటీకి నిలిపి అత్యదిక మెజారిటీ తో గెలుపొందారు..
దివంగత నేత భూమా నాగిరెడ్డి కి వీరఅభిమాని అయిన మొహన్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నారు. మాజీ ఎం ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి,మాజీమంత్రి అఖిల ప్రియఆత్మీయుడిగా భూమా కుటుంబాలగెలుపుకోసం నంద్యాల,ఆళ్ల గడ్డలో కృషి చేస్తున్నారు.. ఈ నేపద్యంలో మోహన్ రెడ్డి నారా లోకేష్ అపాయింట్మెంట్ పొంది ఆయనను కలవడం ప్రత్యేకత సంతరించుకుంది.. దాదాపు 15 నిమిషాలు స్థానిక రాజకీయ పరిస్థితులపై మోహన రెడ్డి లోకేష్ తో చర్చించినట్లు సమాచారం.. పార్టీకి, భూమా కుటుంబాలకు విధేయత గా వుంటూ భూమా గెలుపుకోసం కృషి చేస్తానని ఈసందర్భంగా మోహన్ రెడ్డి నారా లోకేష్ కి తెలిపినట్లు సమాచారం