కర్నూలుజిల్లాలో తానాఅద్యక్షుడు నిరంజన్ కుఘనస్వాగతంపలికిన ప్రజలు..జిల్లా అభివృద్దికి కృషిచేస్తామన్న నిరంజన్

ప్రజాన్యూస్ ప్రతినిది మూల్పూరి ప్రభాకర్ చౌదరి

కర్నూలు నవంబరు 8(ప్రజాన్యూస్);కర్నూులుజిల్లా అబివృద్దికి తానాపౌండేషన్ ద్వారా తమవంతు కృషిచేస్తామని ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా)అద్యక్షులు శృంగవరపు నిరంజన్ పేర్కొన్నారు..తానా అద్యక్షుడిగా ఎన్నికై కర్నూలుజల్లాలోని తన స్వగ్రామానికి విచ్చేసిన సందర్బంగాఆయనకు జిల్లావాసులు ఘనస్వాగతం పలికారు.

నంద్యాలపట్టణంలోని నందిప్యారడైజ్ నుండి స్వగ్రామం రాజనగరం వరకు తానా అద్యక్షుడుకి వివిద సంఘనేతలు,వివిద పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు..తొలుత నందిప్యారడైజ్ లో భారతీయ నమోసంఘ్ రాష్ట్రు అద్యక్షులు అబిరుచిమదు తెలుగుదేశం రాష్ట్రరైతుసంఘ కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు, నంద్యాలటిడిపి పార్లమెంటు కార్యాలయం కార్యదర్శి చిలుకూరు రవితో పాటుగా వైకాపానాయకులు నందగారి వెంకటేశ్వర్లు కమ్మసంఘం అద్యక్షులు వడ్లమూడి మల్లేశ్వరచౌదరి, కమ్మసంఘ మాజీ అద్యక్షులు దూదిపళ్ల వెంకటరమణ,వేమసాని శ్రీనివాసచౌదరి,సుబ్బాారావు తదితర కమ్మసంఘనేతలు ఘనంగ సన్మానించారు..అనంతరం పుల్లయ్యచౌదరి ఆద్వర్యంలో నంద్యాలనుండి యర్రగుంట్ల వరకు వందలాది వాహనాలలో అభిమానులు వెంటరాగా నిరంజన్ స్వగ్రామానికి బయలుదేరారు.శిరివెళ్ల మండలం యర్రగుంట్ల,గుంప్రమాన్ దిన్నె,రాజనగరం గ్రామస్థులు అడుగడుగునా వేలాదిమంది హాజరై తానా అద్యక్షుడికి ఘనస్వాగతం పలికారు..అడగడుగునా పూలజల్లు కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు..గుంప్రమాన్ దిన్నె,రాజనగరం గ్రామాలలో పుల్లయ్యచౌదరి ఆద్వర్యంలో బారీ గజమాలను పొక్లయిన్ తో నిరంజన్ కు సమర్పించి గ్రామస్తులు తమఅబిమానాన్ని చాటుకున్నారు..అనంతరం తానా అద్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూే తానా అద్యక్షుడిగా ఎన్నికై స్వగ్రామానికి మొట్టమొదటిసారిగి విచ్చేసిన సందర్బంగా ప్రజలు అభిమానులు బందు మిత్ర శ్రేయోభిలాషులు స్వాగతం పలికిన తీరు తాను మర్చిపోలేనన్నారు..వారి అభిమానం వమ్ముచేయకుండా కర్నూలుజిల్లాలో తానా పౌండేషన్ ద్వారా తెలుగువారికి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు..పదిరోజులపాటు అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు…తాను పదవిలో ఉండే కాలంలో కర్నూలుజల్లా అబివృద్దికి ప్రణాళికలు తయారుచేసి తమవంతు సహాయం అందిస్తామన్నారు..అనంతరం ఆళ్లగడ్డ,బనగానపల్లె,నంద్యాల,బేతంచెర్ల ఆత్మకూరు కర్నూలు ప్రాంతాలనుండి తరలివచ్చిన వివిద సంఘాలు నేతలు నిరంజన్ను గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఘనంగా సన్మానించారు..కార్యక్రమంలో కమ్మసంఘనేతలు కమ్మకృష్ణారావు,వేమసాని శ్రీనివాసరావు, కొల్లూరి శ్రీనివాసరావు, మనోహర్ సుబ్బారావు తో పాటుగా అదికసంఖ్యలో కమ్మబందువులు  చుట్టుపక్కల గ్రామస్థులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *