ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాల సెప్టెంబరు13(ప్రజాన్యూస్):సంజామల మండలం అక్కంపల్లె చెరువుకు నీటిని నింపి రైతులను ఆదుకోవాలని రైతుసంఘ నాయకుడు ఆదిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
.ఈమేరకు ఆయన సోమవారం నంద్యాలపట్టణంలోని సబ్ కలెక్టరు కార్యాలయంలో సబ్ కలెక్టరు చాహత్ బాజ్పేయ్ ని కలిసి స్సందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు..అనంతరం ఆయన మీడియా తో్మాట్లాడుతూ ఉయ్యలవాడ మండలం కాకరవాడ నుండి దాదాపు 8కిమీ నిడివిాతో అక్కంపల్లి చెరువుకు పైపులైను నిర్మించి ఎత్తిపోతలపదకం ద్వారా నయనాలప్పకుంట,అక్కంపల్లి చెరువులను నింపేందుకు దాదాపు 20కోట్లరూపాయలు వెచ్చించి పైపులైను నిర్మాణం చేపట్టి 2016 లో పదకాన్ని ప్రారంబించారన్నారు..అప్పటినుండి గత ప్రభుత్వ హయంవరకు చెరువును నింపేవారిని అయితే ప్రస్తుతం ఏ గ్రహణం పట్టిందోగాని చెరువును నింపేనాదుడే కరువయ్యారన్నారు..రాష్ట్రప్రభుత్వ అధికారులు అన్నిచెరువులను నింపేశామనిఆర్బాటపుప్రకటనలుచేయడంమీడియావత్తాసుపలకడంతప్పఆచరణలోవిపలమయ్యారన్నారు..ఈచెరువునింపడం ద్వారా దాదాపు 200 వ్యవసాయ బోరుల ద్వారా,చెరువునీటి ద్వారా మరో 600 ఎకరాలకు సాగునీరు అంది సన్నచిన్నకారు రైతులకు సాగునీటి కష్టాలు తీరతాయన్నారు..బోర్లు రీచార్జి కావడంతో తాగు సాగునీటి అవసరాలకు కొదవ ఉండదన్నారు..అందుకే సమస్యను సబ్ కలెక్టరు దృస్టికి తీసుకువెళ్లామని వారంరోజులలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చిందన్నారు..ఇప్పటికైనా ప్రజా ప్రతినిదులు అదికారులు స్పందించిఅక్కంపల్లిచెరువుకు నీటిని పంపింగ్ చేయాలని రైతు సంఘనేత ఆదిరెడ్డి ప్రభుత్వాన్నికోరుతున్నారు…