నంద్యాల ఆగష్టు14(ప్రజా టివి వెబ్ న్యూస్): కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యధావిదిగ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని జిల్లా రిజిస్టర్ ఉషారాణి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ చలనా కుంభకోణం లో నంద్యాల సబ్ రిజిస్టార్ సోఫియాబేగంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ వీరయ్య సస్పెండ్ అయిన నేపద్యంలో శుక్రవారం జాయింట్ సబ్ రిజిస్టార్ మినహా మిగిలిన సిబ్బంది కార్యాలయానికి గైరు హాజరయ్యారు.. దీంతో శుక్రవారం కార్యాలయం బోసిపోయింది..
ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ మురళి మాట్లాడుతూ ఇరువురు సస్పెండ్ కాగా మరో ఇరువురు శెలవు పెట్టారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు…సంఘటన పై జిల్లా రిజిస్టర్ ఉషారాణి స్పందించారు…నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యధావిధిగా రిజిస్ట్రేషన్ లు చేస్తామన్నారు.. సిబ్బంది కొరత లేకుండా తమ కార్యాలయంనుండి సిబ్బందిని పంపుతున్నామన్నారు.నకిలీ చలాను కుంభకోణం లో స్టాంప్ రైటర్స్ తప్పును ఒప్పుకున్నారని వారినుండి నగదు కూడా రికవరీ చేశామని వారిపై ఫిర్యాదు కూడా చేశామన్నారు… ప్రజలు డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా,డాక్యు మెంట్ తయారు చేసుకునే విధంగా ఏర్పాటు వుండాన్నారు… ఏ సందేహం ఉన్నా హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యలు పరిష్కారం పొందవచ్చన్నారు…