నంద్యాల జులై9(ప్రజా న్యూస్):గత మూడు రోజులుగా నంద్యాల డివిజన్ లో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకల్లో నీటి ప్రవాహం పెరిగింది… ఈ నేపధ్యంలోరెవెన్యూయంత్రాంగంఅప్రమైంది..ముందస్తు జాగ్రత్తగామద్ది లేరు. కుందు. శ్యామ కాల్వ లప్రవాహిత ప్రాంతాలను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు
శుక్రవారం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ నంద్యాల తహసీల్దార్ రవికుమార్. డి ఐ ఓ ఎస్ రవీంద్ర పాల్ లతో కలిసి మద్ది లేరు. కుందు. శ్యామ కాల్వ ల ప్రవాహి త ప్రాంతాలను పరిశీలించారు
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాకాలములో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళిక కొరకు మద్ది లేరు ప్రక్కన ఉన్నటువంటి హరిజనవాడ కాలని కుందూ నది రాణి మహారాణి థియేటర్ల దగ్గర ఉన్న బ్రిడ్జి ని వై జంక్షన్ వద్ద ఉన్న శ్యామ కాల్వ పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని అన్నారు